NTV Telugu Site icon

Chicken Handi : ఈ విధంగా చికెన్ హండి చేస్తే ముక్క కూడా మిగిల్చకుండా లాగిస్తారు..

Chicken Handi

Chicken Handi

ముస్లింలకు ఇష్టమైన పండుగ బక్రీద్.. ఈ పండుగను చాలా ప్రత్యేకంగా రకరకాల వంటలతో బంధుమిత్రులతో జరుపుకుంటారు.. ఈరోజు మనం స్పెషల్ గా కాస్త కొత్తగా రెస్టారెంట్ స్టైల్లో చికెన్ హండి ని ఇంట్లోనే ఎలా తయారు చెయ్యాలో చూద్దాం..ఈ చికెన్ హండిని తయారు చేయడం చాలా తేలిక. అరగంటలోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు.. ఎలా తయారు చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం..

కావల్సిన పదార్థాలు..

చికెన్ – 500 గ్రా

నూనె – 3 టేబుల్ స్పూన్స్,

నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్,

వెల్లుల్లి తరుగు – ఒక టేబుల్ స్పూన్స్,

తరిగిన ఉల్లిపాయ ముక్కలు – ఒక కప్పు,

బిర్యానీఆకులు – 2,

దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క,

లవంగాలు – 3,

యాలకులు – 3,

అల్లం పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్,

చిన్నగా తరిగిన టమాట ముక్కలు – ఒక కప్పు,

పసుపు – పావు టీ స్పూన్,

ఉప్పు – తగినంత,

కారం – 2 టీ స్పూన్స్,

చికెన్ మసాలా – ఒక టేబుల్ స్పూన్,

ధనియాల పొడి -ఒక టీ స్పూన్,

చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 4,

చిలికిన పెరుగు – పావు కప్పు,

కసూరి మెంతి – ఒక టేబుల్ స్పూన్,

క్రీమ్ – 2 టేబుల్ స్పూన్స్,

నీళ్లు – తగినంత,

తరిగిన కొత్తిమీర – కొద్దిగా.

తయారీ విధానం..

మనం నాన్ వెజ్ ఎప్పుడూ చేసిన ముందుగా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.. ఇప్పుడు చికెన్ ను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి..ఆ తర్వాత కళాయిలో నూనె, నెయ్యి వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక వెల్లుల్లి తరుగు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వేగిన తరువాత బిర్యానీ ఆకులు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వేసి వేయించాలి. తరువాత టమాట ముక్కలు వేసి మెత్తగా అయ్యే వరకు వేయించాలి. టమాట ముక్కలు మెత్తబడిన తరువాత చికెన్ వేసి బాగా కలపాలి..ఒక రెండు నిమిషాలు హై లో పెట్టి బాగా కలపండి..తరువాత ఉప్పు, పసుపు, కారం, చికెన్ మసాలా, ధనియాల పొడి వేసి కలపాలి. తరువాత మంటను చిన్నగా చేసి పచ్చిమిర్చి, పెరుగు వేసి కలపాలి. దీనిని అంతా కలిసేలా కలుపుకున్న తరువాత మూత పెట్టి మంటను మధ్యస్థంగా చేసుకోవాలి.. ఆ తర్వాత చిన్న మంటపై 10 నిమిషాలు ఉడికించిన తర్వాత ఒకసారి బాగా కలిపి కసూరి మెంతి, ఫ్రెష్ క్రీమ్ వేసి కలపాలి. తరువాత నీళ్లు పోసి కలపాలి. ఇప్పుడు మరలా మూత పెట్టి చికెన్ మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. చికెన్ మెత్తగా ఉడికిన తరువాత కొత్తిమీర తో గార్నిష్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.. అంతే ఎంతో రుచికరమైన చికెన్ హండి రెడీ.. రోటి, చపాతీ, బిరియాని దేనిలోకైనా వేసుకొని తింటే ముక్క కూడా మిగిల్చకుండా లాగిస్తారు..నచ్చితే ట్రై చెయ్యండి..

Show comments