నాన్ వెజ్ ప్రియులకు ఎక్కువగా చికెన్ అంటే ఇష్టం ఉంటుంది.. చికెన్ లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి.. అందుకే చాలా మంది చికెన్ ను తినడానికి ఆసక్తి చూపిస్తారు.. కొంతమంది రోజూ నాన్ వెజ్ ను తింటారు.. అలా తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నా పెద్దగా పట్టించుకోరు.. అంతేకాదు రోజూ బయటకు వెళ్లి తెచ్చుకోవడం కష్టం అని తెచ్చుకొని ప్రిడ్జ్ లో దాచి పెట్టుకుంటారు.. చికెన్ ను ప్రిడ్జ్ లో పెట్టుకొని తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.. కొన్ని టిప్స్ పాటించాలని చెబుతున్నారు.. అవేంటో ఒక్కసారి చూసేద్దాం..
ఫ్రిడ్జ్‌లో చికెన్ స్టోర్ చేయడమనేది ఎప్పటినుంచో వస్తుంది. ఎందుకంటే దీనిలో స్టోర్ చేయడం చాలా సులభం, సౌకర్యవంతంగా ఉంటుంది కాబట్టి. అయితే చికెన్‌ను ఫ్రిడ్జ్‌లో ఉంచవచ్చా.. లేదా? అది ఎంతకాలం సురక్షితంగా ఉంటుంది వంటి విషయాలు గురించి ఎప్పుడైనా తెలుసుకున్నారా? ఇప్పటికైనా తెలుసుకోండి..
చికెన్ వండకుండా ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల రెండు రోజులు బాగానే ఉంటుందట.. అలాగే వండినదాన్ని పెడితే నాలుగు రోజులు ఉంటుందని చెబుతున్నారు.. 4°C కంటే తక్కువ ఉష్ణోగ్రతలలో బ్యాక్టీరియా నెమ్మదిగా వృద్ధి చెందుతుంది. కాబట్టి ఫ్రిజ్‌లో చికెన్‌ను స్టోర్ చేయడం వల్ల బ్యాక్టీరియా పెరుగుదల నెమ్మదిస్తుంది. చికెన్‌ని గాలి చొరబడని కంటైనర్‌లో ఉంచి ఫ్రిడ్జ్‌లో పెడితే ఇంకా మంచిది.. ఇక కర్రీని కూడా అంతే అలానే నిల్వ ఉంచవచ్చునట.. అది బూడిద రంగులో లేడా ఆకుపచ్చ రంగులో మారితే ఆ చికెన్ చెడిపోయినట్లు గుర్తించాలి.. ఇక దాన్ని వెంటనే పడేయ్యడం మంచిది..