NTV Telugu Site icon

Health Tips: నాలుక రంగు చూసి ఏ జబ్బు ఉందో తెలుసుకోవచ్చు..!

Tongue

Tongue

ప్రపంచ వ్యాప్తంగా అనేక రకాల వ్యాధులు వేగంగా పెరుగుతున్న దృష్ట్యా మనం ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. లేదంటే.. ఎన్నో రకాల వ్యాధులతో పోరాడలేక సమస్యలు తీవ్ర తరం అవుతాయి. అయితే.. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నో రకాల వ్యాధులు, రోగాలు మనుషులను పట్టి పీడిస్తున్నాయి. వాటితో జాగ్రత్తగా ఉండి.. వైద్యుడిని సంప్రదించి సలహాలు తీసుకుంటేనే ఆరోగ్యంగా ఉండగలం.. అయితే.. కొన్ని తీవ్రమైన వ్యాధులకు స్కానింగ్, ఎక్స్ రే లాంటివి చేయించుకుంటేనే ఆ సమస్య ఏంటని బయటపడతాయి. అప్పుడు ఆ సమస్య బారి నుండి మనం తప్పించుకోవచ్చు. అయితే.. కొన్ని వ్యాధులకు నాలుక రంగును చూసి గుర్తించవచ్చు. అదేలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

నాలుక రంగులో మార్పులు కూడా ఇన్ఫెక్షన్ లేదా అనేక రకాల తీవ్రమైన వ్యాధుల వంటి అంతర్లీన ఆరోగ్య సమస్యకు సంకేతమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నాలుక సాధారణంగా లేత ఎరుపు-గులాబీ రంగులో ఉంటుంది. అలా కాకుండా.. అసాధారణమైన మార్పు కనిపిస్తే జాగ్రత్తగా ఉండటం మంచిది. మన నాలుక శరీరంలో వచ్చే అనేక రకాల వ్యాధులను సూచిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అనేక వైద్య పరిస్థితులు నాలుక ఆకారం, రంగు మరియు ఆకృతిని ప్రభావితం చేస్తాయి. కొన్ని వ్యాధులు వస్తే నాలుక రంగు ఆకుపచ్చ, నీలం లేదా నల్లగా మారుతుంది. నాలుక సాధారణ రంగులో ఉంటే పెద్ద ప్రమాదమేమీ లేదు. కానీ.. పూర్తిగా భిన్నంగా కనిపిస్తే, జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. నాలుక రంగులో మార్పుల ఆధారంగా ఆరోగ్య సమస్యలను ఎలా గుర్తించవచ్చో తెలుసుకుందాం.

Read Also: Karnataka: పాలస్తీనా జెండాలతో హల్‌చల్.. నలుగురు మైనర్లు అరెస్ట్

పసుపు రంగు:
నాలుక పసుపు రంగులోకి మారడం సాధారణంగా బ్యాక్టీరియా పెరుగుదల వల్ల వస్తుంది. అంతేకాకుండా.. నోటి పరిశుభ్రత, నోటిలో తేమ లేకపోవడం వల్ల నాలుకపై బ్యాక్టీరియా పెరుగుదలకు దారితీస్తాయి. దాని వల్ల నాలుక పసుపు రంగులో కనిపిస్తుంది. 2019 అధ్యయనం ప్రకారం.. పసుపు నాలుక మధుమేహం యొక్క సంకేతం.. కొన్ని సందర్భాల్లో కామెర్లు ఉంటే కూడా నాలుకు పసుపుగా ఉంటుంది.

ఆరెంజ్ రంగు:

నాలుక నారింజ రంగులో మారితే శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. కొన్ని యాంటీబయాటిక్స్, ఆహారాలు నాలుకను నారింజ రంగులోకి మారుస్తాయి. అలాంటప్పుడు నోటి శుభ్రంపై జాగ్రత్త వహించాలి.

నాలుక రంగులో మార్పు ల్యూకోప్లాకియా సంకేతం.. లేత గులాబీ నుండి నీలం రంగులోకి మారడం లేదా నాలుకపై నీలం రంగు మచ్చలు కనిపించడం తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు సంకేతంగా పరిగణించబడుతుంది. సాధారణంగా.. అటువంటి మార్పు రక్తంలో ఆక్సిజన్ లేకపోవడాన్ని సూచిస్తుంది. రక్త రుగ్మతలు, రక్తనాళాలకు సంబంధించిన వ్యాధులు, మూత్రపిండ వ్యాధి కారణంగా నాలుకపై ఇటువంటి మార్పులు కనిపిస్తాయి.