Alcohol: మద్యం మానలేక పోతున్నారా? ఈ టిప్స్ పాటించండి.. ఆరోగ్యం కొంతైన మెరుగవుతుంది?
- మద్యపానం ఆరోగ్యానికి హానీకరం
- తెలిసినప్పటికీ అలవాటుని మానుకోలేరు కొందరు
- దీనివల్ల ఆరోగ్య సమస్యలు
- అలాంటి వారు పాటించాల్సిన టిప్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మద్యపానం చేయడం హానికరమని తెలిసినప్పటికీ అలవాటుని మానుకోలేని వారు చాలామంది ఉంటారు. అయితే విపరీతంగా మద్యం తాగే వాళ్ళు ఒక్కసారిగా మద్యం మానేస్తే కూడా ప్రమాదమేనని చెబుతున్నారు వైద్యులు. అంతే కాకుండా.. కొందరు వీకెండ్ మాత్రమే మందు తాగితే.. మరి కొందరు వారానికి ఏడు రోజులూ తాగుతుంటారు. దీనివల్ల ఆరోగ్య సమస్యలు చుట్టు ముడుతుంటాయి. ఇలాంటి వారు కొన్ని టిప్స్ పాటిండం ద్వారా ఆరోగ్యం త్వరగా పాడైపోకుండా చూసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
రోజూ వ్యాయామం చేయాలి..
యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ నిపుణుల ప్రకారం.. వ్యాయామం కండల కోసం, గుండె కోసం మాత్రమే కాదు. కాలేయానికి కూడా చాలా అవసరం. వ్యాయామం చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. కాలేయంలో కొవ్వు తగ్గుతుంది. శారీరక శ్రమ అనేది.. లివర్ సిర్రోసిస్ ఉన్నవారికి కూడా ప్రయోజనకరంగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. వారంలో కనీసం 150 నుండి 300 నిమిషాల వరకు వ్యాయామం చేయాలి.
Also Read
- Copper Utensils Cleaning Tips: రాగి, ఇత్తడి పాత్రలు నల్లగా మారాయా?.. 5 నిమిషాల్లో కొత్త మెరుపు.. సూపర్ హోం టిప్
- Food Facts: చిల్లు గారెలో చిల్లు ఎందుకు పెడతారో తెలుసా? దాని వెనక ఉన్న ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇదే!
- Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ 'జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు'.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
- Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
నీళ్లు ఎక్కువగా తాగడం అవసరం..
మందు తాగితే లివర్, కిడ్నీలపై చాలా ప్రభావం పడుతుంది. దీన్ని తగ్గించడానికి నీళ్లు ఎక్కువగా తాగడం చాలా ముఖ్యం. మాయో క్లినిక్ ప్రకారం.. సరిపడా నీళ్లు తాగడం వల్ల కిడ్నీలు, కాలేయంపై పడే భారం తగ్గుతుంది. వ్యర్థాలను లివర్ క్లీన్ చేయడానికి నీరు సహకరిస్తుంది. అందువల్ల రోజూ కనీసం.. 8 నుండి 12 గ్లాసుల నీటిని తాగాల్సి ఉంటుందట.
ఎత్తుకు తగ్గ బరువు…
మనిషి బరువుకు, కాలేయ పనితీరు మధ్య ప్రత్యక్ష సంబంధం ఉంటుంది. అందుకే.. హెల్దీ వెయిట్ మెయింటెయిన్ చేయాలి. అధిక బరువు కాలేయంపై ఒత్తిడి పెంచుతుంది. ఇది లివర్లో మంటతోపాటు ఫైబ్రోసిస్ పరిస్థితికి దారి తీస్తుంది. ఈ పరిస్థితి రాకుండా బరువు చూసుకోవాలి. ఆరోగ్యకరమైన బరువు అంటే.. బీఎమ్ఐ సూచించిన బరువు. అంటే.. మనిషి ఎత్తుకు తగిన బరువు ఉండాలి.
ఉప్పు తగ్గించడం మంచిది..
అధిక ఉప్పు మద్యం తాగని వారికి కూడా ముప్పే. కానీ.. మద్యం తాగేవారికి మరింత ముప్పు. లేటెస్ట్ అధ్యయనం ప్రకారం.. అధిక ఉప్పు కాలేయాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. మద్యం చేసే పని కూడా అదే. కాబట్టి.. లివర్ డ్యామేజ్ అయ్యే అవకాశం రెండింతలు ఉంటుందన్నమాట. అందుకే.. ఉప్ప కచ్చితంగా తగ్గించాలి. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం.. రోజుకు 2,300 మిల్లీ గ్రాములకన్నా తక్కువ ఉప్పు తినాలి.
హెల్దీ ఫుడ్..
అతి ముఖ్యమైన అంశం ఆహారం. మద్యం తాగేవారు తప్పకుండా హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. తిన్న తిండిని ప్రాసెస్ చేసేది కూడా కాలేయమే. అప్పటికే మద్యంతో ఇబ్బంది పడుతున్న కాలేయం.. అనారోగ్యకర ఆహారం తినడం ద్వారా మరింతగా ఇబ్బంది పడుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల దీర్ఘకాలంలో లివర్ జబ్బులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి.. మద్యం తాగేవారు తప్పకుండా పోషకాలు నిండిన మంచి ఆహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
వీలైనంత వరకు మద్యం తాగడం తగ్గించండి..
పైన చెప్పిన రక్షణ సూత్రాలు పాటించడంతోపాటు.. మద్యం చాలా తక్కువగా తీసుకోవడం అనేది అలవాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కెనడియన్ సెంటర్ ఆన్ సబ్స్టాన్స్ అబ్యూజ్ అండ్ అడిక్షన్ – 2023 ప్రకారం.. వారానికి 30 ml కంటే ఎక్కువ తాగకూడదట. ఆల్కహాల్ ఎంత తీసుకున్నా.. తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయని నివేదిక వెల్లడించింది. కాబట్టి.. వీలైతే మద్యం తీసుకోవడం మానుకోవడం మంచిది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!