NTV Telugu Site icon

BlueTea Benefits : బ్లూటీని రోజూ ఇలా తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలో.. ఆ రోగాలు జన్మలో రావు..

Blue

Blue

పొద్దున్నే లేవగానే చాలామందికి టీ తాగే అలవాటు ఉంటుంది.. అయితే ఆ టీ ఈ టీ కాకుండా ఆయుర్వేద టీ తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.. అందులో ఒకటి బ్లూ టీ..శుంఖుపుష్పాన్ని అపరాజిత, గిరికర్ణిక, దింటెన అనే పేర్లతోనూ పిలుస్తుంటారు. ఈ పుష్పాన్ని పూజలో ఎంత ప్రవిత్రంగా భావిస్తారో ఆయుర్వేదంలోనూ అంతే ప్రత్యేకంగానూ బావిస్తుంటారు. ఆయుర్వేద వైద్యంలో ఎన్నో అనారోగ్యాల చికిత్సకు శంఖుపుష్పాన్ని వాడుతూ ఉంటారు. శంఖుపుష్పాల టీని తరచుగా తీసుకుంటే.. అనేక ఆరోగ్య సమస్యల నుంచి రక్షణ పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ టీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని ఫ్రీ రాడికల్స్‌ నుంచి రక్షిస్తాయి. ఫ్రీ రాడికల్స్ శరీరంలోని ఆరోగ్యకరమైన కణాలను దెబ్బతీసే హానికరమైన పదార్థాలు. ఖాళీ కడుపుతో వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఒక కప్పు టీ తాగితే.. జీర్ణక్రియలో పేరుకున్న టాక్సిన్స్‌ తొలగుతాయి. ఇది జీర్ణక్రియ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఎసిడిటీ, మలబద్ధకం, ఉదర సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయని చెబుతున్నారు..

బరువు తగ్గేవారికి ఈ టీ ఎంతో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. శంఖుపువ్వుల టీలో కెఫిన్‌ ఉండదు. అలాగే కార్బోహైడ్రేట్స్‌, కొవ్వులు, కొలెస్ట్రాల్‌ ఉండవు. ఇది బరువు తగ్గడానికి తోడ్పడుతుంది. ఇది జీర్ణక్రియ నుంచి ఆహార వ్యర్థాలు, టాక్సిన్స్‌ను తొలగిస్తాయి, అలాగే ఆకలిని నియంత్రిస్తుంది. చిరుతిండ్లు తినాలనే కోరికను తగ్గిస్తుంది.. దాంతో అధిక బరువు అదుపులో ఉంటుంది.. దాంతో బరువు కంట్రోల్లో ఉంటుంది..రక్తంలో చక్కెర స్థాయిలు ఆకస్మికంగా పెరగకుండా నివారిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ టీలో ఫినోలిక్ యాసిడ్, ఫినాలిక్ అమైడ్ యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీహైపెర్గ్లైసీమిక్ గుణాలు మెండుగా ఉంటాయి. ఇవి ఇన్సులిన్ స్రావాన్ని మెరుగుపరుస్తాయి, గ్లూకోజ్ జీవక్రియను నియంత్రిస్తాయి..

ఇకపోతే రోజూ ఈ టీ తాగితే.. హానికరమైన ట్రైగ్లిజరైడ్, చెడు కొలెస్ట్రాల్‌ సాంద్రతలు తగ్గుతాయి. అదే సమయంలో మంచి కొలెస్ట్రాల్‌ స్థాయిలను పెంచుతుంది. ఇది క్రమంగా, అథెరోస్క్లెరోసిస్, హార్ట్ ఎటాక్‌, ధమనులలో రక్తం గడ్డకట్టడం, హైపర్‌టెన్షన్‌ వంటి తీవ్ర అనారోగ్యాల నుంచి రక్షిస్తుంది.. అలాగే కళ్ళకు కూడా చాలా మంచిది..ఈ టీలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, అనాల్జేసిక్ లక్షణాలు కంటి ఇన్ఫెక్షన్లు, ఎరుపు, వాపు వంటి సమస్యలను తగ్గిస్తాయి. ఆప్టిక్ కణాలు, కళ్ల వైపు, అవసరమైన పోషకాలతో నిండిన రక్త ప్రవాహాన్ని ప్రేరేపిస్తుంది.. రోజూ తాగడం వల్ల కంటి సమస్యలు దూరం అవుతాయి..