Site icon NTV Telugu

Winter Bath: చలికాలంలో వేడి నీళ్లు మంచివా.. చలి నీళ్లు మంచివా..

Untitled Design (7)

Untitled Design (7)

చలి కాలం వచ్చిందంటే చాలు.. నరాలు కొరికే చలి.. మనల్ని వణికిస్తుంది. రాత్రయితే దుప్పటి కప్పుకున్నా చలి ఆగదు. ఉదయాన్నే లేచి స్నానం చేయాలంటే.. ప్రాణం పోయినంత పని అయిపోతుంది. చాలా మంది చలికాలంలో చన్నీళ్ల కన్నా.. వేడి నీళ్లతోనే స్నానం చేసేందుకు ఇష్టపడుతుంటారు. అయితే.. చలికాలంలో… చన్నీళ్ల కంటే వేడి నీళ్లే డేంజర్ అంటూ.. నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Read Also: Unique Offer : రూపాయి నోట్ తెచ్చుకో.. హాఫ్ కేజీ చికెన్ తీసుకో…

చాలా మంది చలికాలం వచ్చిందంటే.. దుప్పట్లో దూరిపోతారు.. ఉదయం నిద్ర లేవాలంటే బద్దకిస్తారు. రాత్రి ఒంటి నీటి చుక్క పడిందంటే చాలు.. ఒళ్ల జలదరిస్తుంది. అలాంటిది.. స్నానం చేయాలంటే.. తట్టుకోలేము. వేడి నీళ్లతో స్నానం చేసేందుకే ఎక్కువ మొగ్గు చూపుతాం. అయినప్పటికి చలికాలంలో వేడి నీటి స్నానం అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.

Read Also:Telangana Tourism: పర్యాటకులకు తెలంగాణ టూరిజం బోర్డ్ గుడ్ న్యూస్..

చలికాలంలో‌ వేడి నీళ్లతో స్నానం చేస్తే.. కాస్త రిలాక్స్ డ్ గా ఉంటుందని అందరం అనుకుంటాం.. కానీ అది నిజం కాదని.. ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వేడి నీటితో స్నానం శరీరానికి హాయినిచ్చినా.. అలసట నుంచి ఉపశమనం కలిగించినప్పుటికి అది సేఫ్ కాదంటున్నారు. వేడి నీటితో స్నానం చేయడంతో …చర్మంపై ఉండే జిడ్డు పొర తొలగిపోతే దురదకు వస్తుందని తెలిపారు. అంతే కాకుండా..చర్మ వ్యాదులు మరింత పెరుగుతాయంటున్నారు. పాలిసిథెమియా వెరా వ్యాధి ఉన్న వాళ్లయితే.. వేడి నీళ్లతో స్నానం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

Read Also:Couple Kissing on Car Roof: కారు పైకప్పుపై ముద్దు పెట్టుకున్న జంట.. వీడియో వైరల్

అయితే పాలిసిథెమియా వెరా వ్యాధి అనేది.. చర్మం అవసరమైన దానికంటే ఎక్కువ ఎర్ర రక్త కణాలను విడుదల చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీంతో చర్మం ఎర్రగా కందిపోతుందని హెచ్చరిస్తున్నారు. వేడి వేడి నీళ్లతో స్నానం చేస్తే చర్మం పొడిబారిపోయి, రోమాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుందంటున్నారు స్కిన్ ఎక్స్ పర్ట్స్. అయితే అటు చన్నీళ్ల స్నానం చేసినా.. సమస్యలు వస్తాయని.. అయితే ఈ రెండిండికి మధ్యలో.. గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం ఎంతో ఉత్తతమని.. వైద్యులు చెబుతున్నారు. ఈ సమాచారం అంతా మేము ఇంటర్నెట్ నుంచి గ్రహించాం .. కావున మీరు దీన్ని ఫాలో అయ్యేందుకు ఒకసారి మీ దగ్గరలో ఉన్న డాక్టర్లను సంప్రదించి నిర్ణయం తీసుకోవడం మంచింది.

Exit mobile version