Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Benefits of Hugging: ప్రస్తుత ఆధునిక జీవితంలో పనిఒత్తిడి, కుటుంబ బాధ్యతలు, మానసిక ఆందోళనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో భార్యాభర్తల మధ్య ప్రేమ, అనుబంధం మరింత బలపడటం చాలా అవసరం. రోజంతా బిజీగా గడిపిన తర్వాత ఒకరినొకరు కౌగిలించుకుని నిద్రపోవడం కేవలం ప్రేమను వ్యక్తపరిచే చర్య మాత్రమే కాదు.. శారీరకంగా, మానసికంగా కూడా ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. పరిశోధనల ప్రకారం హగ్ చేసుకోవడం వల్ల శరీరంలో కొన్ని కీలక హార్మోన్లు విడుదలై ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మరి ఆ వివరాలేంటో చూద్దామా..
ఆక్సిటోసిన్ విడుదల:
భార్యాభర్తలు హగ్ చేసుకున్నప్పుడు మెదడులో ‘ఆక్సిటోసిన్’ (Oxytocin) అనే హార్మోన్ విడుదల అవుతుంది. దీనిని సాధారణంగా “లవ్ హార్మోన్” లేదా “కడ్డల్ కెమికల్” అని పిలుస్తారు. దీని వల్ల కలిగే ప్రయోజనాల విషయానికి వస్తే.. ఒత్తిడికి కారణమయ్యే ‘కార్టిసాల్’ హార్మోన్ తగ్గుతుంది. దీని వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది. ఇంకా భద్రత, నమ్మకం భావనలు పెరుగుతాయి. దీనితో దాంపత్య బంధం మరింత బలపడుతుంది.
Also Read
- Kitchen Tips: అల్లం తొక్క క్షణాల్లో ఊడిపోవాలంటే ఈ టెక్నిక్ పాటించండి
- Healthy Lifestyle: ఎక్కువ కాలం ఆరోగ్యంగా బతకాలని ఉందా.. ఈ టైమ్‌లోనే బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్ చేయండి!
- Food Facts : పప్పులో తెల్లటి నురుగు.. మురికేనా.? అసలు నిజం ఇదే.!
- Silver Cleaning Trick: వెండి ఆభరణాలపై నలుపు పోవాలా? ఇలా క్లీన్ చేస్తే కొత్తదానిలా మెరిసిపోతాయి!
నిద్ర నాణ్యత మెరుగు:
హగ్ చేసుకుని నిద్రపోవడం వల్ల శరీరం సహజంగానే రిలాక్స్ అవుతుంది. దీనితో నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది. రక్తపోటు, హృదయ స్పందన స్థిరపడటంతో త్వరగా నిద్ర పట్టే అవకాశం ఉంటుంది. ఇది గాఢ నిద్రకు సహాయపడుతుంది. అలాగే రాత్రి మధ్యలో మేల్కొనే అవకాశాలు తగ్గుతాయి. ఇంకా ఉదయం లేవగానే తాజాగా అనిపిస్తుంది.
ఒత్తిడి, ఆందోళన తగ్గుదల:
శారీరక స్పర్శ వల్ల మెదడు ప్రశాంత సంకేతాలను స్వీకరిస్తుంది. దీంతో మానసిక ఒత్తిడి తగ్గి, ఆందోళన స్థాయిలు క్రమంగా నియంత్రణలోకి వస్తాయి. దీని ఫలితంగా.. మూడ్ మెరుగుపడుతుంది. ఇంకా చిరాకు తగ్గుతుంది. దీనితో సానుకూల ఆలోచనలు పెరుగుతాయి. ముక్యంగా డిప్రెషన్ లక్షణాలు తగ్గే అవకాశం ఉంటుంది.
గుండె ఆరోగ్యానికి మేలు:
బాగా హగ్ చేసుకునే అలవాటు గుండె ఆరోగ్యంపై కూడా సానుకూల ప్రభావం చూపుతుంది. అది ఎలా అంటే..? రక్తపోటు నియంత్రణ ఉండడంతో.. గుండెపై ఒత్తిడి తగ్గుతుంది. దీనితో హృదయ సంబంధిత సమస్యల ప్రమాదం తగ్గే అవకాశం ఉంటుంది.
రోగనిరోధక శక్తి పెరుగుదల:
ఆక్సిటోసిన్, ఇతర సానుకూల హార్మోన్ల ప్రభావంతో శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ మరింత సమర్థవంతంగా పనిచేస్తుంది. దీనివల్ల సాధారణ జలుబు వంటి సమస్యల నుంచి రక్షణ లభిస్తుంది. శరీరం వ్యాధులతో పోరాడే సామర్థ్యం పెరుగుతుంది.
మరింత బలంగా దాంపత్య బంధం:
హగ్ అనేది మాటల కంటే ఎక్కువగా భావాలను వ్యక్తపరిచే మార్గం. ప్రతిరోజూ కొద్దిసేపు కౌగిలించుకోవడం వల్ల భార్యాభర్తల మధ్య ప్రేమ, అవగాహన, నమ్మకం మరింత పెరుగుతాయి. దీనివల్ల అనే దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉన్నాయి. దంపతుల మధ్య మనస్పర్థలు తగ్గుతాయి. ఇంకా పరస్పర గౌరవం పెరుగుతుంది. వైవాహిక సంబంధం మరింత సంతోషకరంగా మారుతుంది.
తాజావార్తలు
-
King 100 : సంక్రాంతి కంటే ముందే విడుదలకి రెడీ అవుతున్న ‘కింగ్ 100’
-
Dil Raju: ‘టాక్సిక్’తో దిల్ రాజుకు జాక్‌పాట్.. సినిమా రిజల్ట్ ఏదైనా ప్రాఫిటేనట! అసలు లెక్క ఇదే..
-
IND vs SL 2nd Test: అదే జరిగితే.. టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు గల్లంతే!
-
Re Release : స్టార్ హీరోల ఫ్యాన్స్‌ను హర్ట్ చేస్తోన్న రీ-రిలీజ్ మూవీస్
-
10.1 అంగుళాల టచ్‌స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్‌తో Suzuki e-Sky లాంచ్..!
ట్రెండింగ్
-
8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz AMOLED డిస్ప్లేతో Realme P4s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
165Hz డిస్ప్లే, 24GB RAM, 7,470mAh బ్యాటరీతో Lenovo Legion Tab Y700 AI టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే?
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..