NTV Telugu Site icon

Honey Benefits: చలికాలంలో తేనె తీసుకుంటే ఆ వ్యాధులు దరి చేరవు.. ముఖ్యంగా దానికి..!

Honey440 Bb52330

Honey440 Bb52330

శీతాకాలం మొదలైంది. చలికాలం మన చర్మానికి చాలా హాని కలిగిస్తుంది. ఈ సీజన్‌లో చర్మం పొడిబారి నిర్జీవంగా మారుతుంది. అంతే కాకుండా.. జలుబు, దగ్గు, జ్వరం లాంటి అనేక ఆరోగ్య సమస్యల ప్రమాదం పెరుగుతుంది. వీటిని నివారించడానికి తేనె చాలా ఉపయోగకరంగా ఉంటుంది. చలికాలంలో చర్మంలోని తేమ తగ్గి చర్మం పొడిబారడం వల్ల అనేక చర్మ సమస్యలు వస్తాయి. ఈ సీజన్‌లో శరీరానికి అవసరమైన విటమిన్ డి విటమిన్ కావాలి. లేదంటే.. దీని ప్రభావం చర్మంపై స్పష్టంగా కనిపిస్తుంది. విటమిన్ డి అనేది కరిగే విటమిన్.. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. శీతాకాలంలో తేనెను తీసుకుంటే ఏయే వ్యాధులను దూరం చేసుకోవచ్చో తెలుసుకుందాం.

జలుబు, దగ్గు నుండి ఉపశమనం పొందుతారు:
ఒక చెంచా తేనెలో ఒక చెంచా నిమ్మరసం కలిపి తాగడం వల్ల జలుబు, దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతే కాకుండా.. తేనె నిమ్మకాయ కూడా రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. శరీరానికి ఎటువంటి వ్యాధి సులభంగా దరిచేరదు.

శరీరంలో డిటాక్సిఫికేషన్ ఉంటుంది:
ఒక కప్పు హెర్బల్ టీలో ఒక చెంచా తేనె కలిపి తీసుకుంటే శరీరంలోని మురికి బయటకు వచ్చి శరీరంలో డిటాక్సిఫికేషన్ జరుగుతుంది.

బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది:
తేనె తీసుకోవడం వల్ల కూడా బరువు తగ్గవచ్చు. మీరు బరువు తగ్గాలనుకుంటే ఒక టీస్పూన్ తేనెలో అర టీస్పూన్ దాల్చిన చెక్క పొడిని కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

దంత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది:
తేనె తీసుకోవడం వల్ల దంత సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు. ఒక చెంచా తేనెలో రెండు చెంచాల యాపిల్ సైడర్ వెనిగర్ కలుపుకుని తాగితే సైనస్ అదుపులో ఉంటుంది.

చర్మం ఆరోగ్యంగా ఉంటుంది:
చలికాలంలో చర్మ సంబంధిత సమస్యల ప్రమాదం పెరుగుతుంది. చలికాలంలో చర్మం పొడిబారుతుంది. చలికాలంలో వేడినీటికి బదులు గోరువెచ్చని నీటితో స్నానం చేయడం మంచిది. దీనితో పాటు తేనె తీసుకోవడం వల్ల చర్మ సంబంధిత సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.