NTV Telugu Site icon

Beetroot Benefits: పరగడుపున బీట్‌రూట్ తింటే.. ఆ సమస్యలకు చెక్..

beetroot

beetroot

బీట్ రూట్ గురించి అందిరికి తెలుసు.. కానీ ఇందులో ఉండే పోషకాలు గురించి ఎవ్వరికి తెలియవు.. బీట్‌రూట్‌లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. బీట్‌రూట్‌లో మంచి మొత్తంలో ఐరన్ ఉంటుంది. ఇది రక్తహీనత సమస్యను నివారిస్తుంది.. వీటిని రోజూ తీసుకోవడం వల్ల ఎన్నో మంచి లాభాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.. ఈ బీట్ రూట్ ను ఎలా తీసుకుంటే మంచి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఇకపోతే సోడియం, పొటాషియం, డైటరీ ఫైబర్, సహజ చక్కెర, మెగ్నీషియం బీట్‌రూట్‌లో అధిక మొత్తంలో కనిపిస్తాయి.. అంతే కాదు బీట్‌రూట్‌ను ఉదయాన్నే ఖాళీ కడుపుతో తింటే, అందులో ఉండే అన్ని పోషకాలను శరీరం బాగా గ్రహిస్తుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో బీట్‌రూట్ తినడం వల్ల మీ ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

ఖాళీ కడుపుతో దుంపలను తినడం ద్వారా, శరీరం దుంపలో ఉండే ఐరన్, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లను పూర్తిగా గ్రహిస్తుంది.. ఇలా తీసుకోవడం వల్ల ఒంట్లో నీరు పోవడం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. ఉదయాన్నే తినడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.. కొందరికి మూత్రానికి సంబంధించిన సమస్యలు ఉంటాయి. మూత్రం సక్రమంగా రావడం లేదనే ఫిర్యాదులు వస్తుంటాయి. ఈ సమస్యను నివారించడానికి, ఉదయం ఖాళీ కడుపుతో బీట్‌రూట్ తినడం ప్రయోజనకరంగా ఉంటుంది. దుంప తినడం వల్ల శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ కూడా మూత్రంతో బయటకు వస్తాయి..

ఉదయాన్నే ఖాళీ కడుపుతో బీట్‌రూట్ తినడం కూడా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. మీరు స్థూలకాయంతో ఇబ్బంది పడుతుంటే, ఖాళీ కడుపుతో వీటిని తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు ఉన్నాయి.. వీటిలో ఫైబర్ అధిక శాతం ఉండటం వల్ల త్వరగా ఆకలిని కలిగించదు. బరువును తగ్గిస్తుంది.. స్కిన్ కలర్ ను కూడా మెరిపిస్తుంది.. అలాగే జుట్టు రాలే సమస్యలను కూడా తగ్గిస్తుంది..