NTV Telugu Site icon

Beauty Tips : చలికాలంలో చర్మం డ్రై అవ్వకుండా ఉండటానికి అద్భుతమైన చిట్కాలు..

Skin Care

Skin Care

చలికాలం వచ్చిందంటే చాలు చర్మం పొడిబారుతుంది.. చల్లని గాలుల కారణంగా చర్మం దురద, పగిలిపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి.. చలికి వేడి వేడి నీటితో స్నానం చేయడం, గాఢత ఎక్కువగా ఉండే సబ్బులు వాడటం వల్ల కూడా పొడి చర్మం సమస్య తలెత్తుతుంది. చలికాలంలో పొడి చర్మం సమస్యను నివారించడానికి అద్భుతమైన చిట్కాలను మీ కోసం తీసుకొచ్చాము.. అవేంటో ఒకసారి చూసేద్దాం..

శీతాకాలంలో శరీరాన్ని వేడిగా ఉంచే, పోషకాలు అధికంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. చలికాలంలో మీ ఆహారంలో.. నెయి, నువ్వుల నూనె, కొబ్బరి నూనె చేర్చుకోండి. ఇవి చర్మాన్ని లోపలి నుంచి హైడ్రేట్‌గా ఉంచడానికి సహాయపడతాయి. శరీరంలో రక్తప్రసరణను మెరుగుపరచుకోవడానికి.. అల్లం, దాల్చినచెక్క వంటి సుగంధ ద్రవ్యాలు వేసిన హెర్బల్‌ టీలు తీసుకోండి.. అవి చర్మాన్ని తేమను కోల్పోకుండా చేస్తాయి..

గోరువెచ్చని నూనెతో మసాజ్‌ చేసుకోవడం.. ఆయుర్వేద స్కిన్‌ రొటీన్‌లో కీలకం. ఇది చర్మానికి పోషణ అందిస్తుంది. శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.. అందుకే స్నానానికి ముందు నూనెలతో మసాజ్ ఒళ్ళంతా తర్వాత స్నానం చెయ్యడం మంచిది..

కెమికల్‌, కఠినమైన సబ్బులు వాడొద్దు. వేప, కలబంద, పసుపు వంటి సహజ పదార్థాలు ఉన్న ఆయుర్వేద సబ్బులు, క్లెన్సర్లు వాడండి.ఇవి చర్మానికి తేమను అందిస్తాయి..

ఎప్పుడూ శరీరాన్ని వేడిగా ఉంచడానికి చూడాలి.. మీ చర్మాన్ని చలి, చల్లని గాలుల నుంచి రక్షించుకోవడానికి… స్వెట్టర్లు, తలకు స్కార్ఫ్‌, క్యాప్‌లు ధరించండి..

చర్మాన్ని తేమగా ఉంచుకోవడానికి తగినంత నీరు తాగడం చాలా అవసరం. రోజుకు కనీసం 8 గ్లాసుల నీరు తాగాలను గుర్తుంచుకోండి. మీరు తాగే నీళ్లలో అల్లం, దాల్చిన చెక్క, యాలకులు వంటి సుగంధ ద్రవ్యాలు చేర్చుకుంటే చాలా మంచిది..

చర్మ ఆరోగ్యానికి నాణ్యమైన నిద్ర చాలా అవసరం. రోజూ కనీసం 8 గంటల నిద్ర అవసరం.. లేకుంటే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.

Show comments