Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bagara Rice: తెలంగాణ వంటకాల్లో బగారా రైస్‌కి ఉన్న ప్రత్యేకతే వేరు. ఆంధ్ర ప్రాంతంలో పలావ్ ఎంత ఇష్టంగా తింటారో.. తెలంగాణలో దావత్లకైనా, పండుగలకైనా ఘుమఘుమలాడే బగారా రైస్ అంతే ఇష్టంగా తింటారు. అయితే ఈ రైస్ చాలా సార్లు ముద్దగా మారడం చూస్తుంటాము. అయితే బగారా రైస్ ముద్దవకుండా, పొడిపొడిగా, అసలైన రుచితో పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూద్దాం. ఈ కొలతలతో మీరు 1 కేజీ నుంచి 100 కేజీల వరకైనా సులభంగా వండవచ్చు. మరి ఎలాగో చూసేద్దామా..
కావలసిన పదార్థాలు
* పాత బియ్యం: 1 కేజీ
* నూనె (లేదా డాల్డా): 70 గ్రాములు
* గరం మసాలా: బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, షాజీరా, జాపత్రి, యాలకులు, అనాస పువ్వు (తగినంత)
* తాజా అల్లం-వెల్లుల్లి పేస్ట్: 90 గ్రాములు
* పచ్చిమిర్చి: 5 (నిలువుగా చీల్చినవి)
* కొత్తిమీర, పుదీనా: అర పిడికెడు
* వేయించిన ధనియాల పొడి: 2 టీస్పూన్లు (ఫ్రెష్‌గా పట్టినది)
* నీరు: 1:1.5 నిష్పత్తి (ఒక గ్లాసు బియ్యానికి గ్లాసున్నర నీరు)
* ఉప్పు: 2 నుండి 3 స్పూన్లు (రుచికి తగినంత)
* క్యారెట్, ఆలుగడ్డ ముక్కలు: 100 గ్రా.
Also Read
- Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
- Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
- Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా "కరివేపాకు కారప్పొడి" కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
- Dishwasher Prices: మహిళలకు గిన్నెలు తోమే తిప్పలు తప్పినట్టే! భారీగా తగ్గిన డిష్వాషర్ల ధరలు..
తయారీ విధానం..
బియ్యం నానబెట్టడం
ముందుగా ఒక కేజీ పాత బియ్యాన్ని శుభ్రంగా కడిగి, కనీసం అరగంట పాటు నీటిలో నానబెట్టుకోవాలి. పాత బియ్యం వాడటం వల్ల అన్నం అస్సలు ముద్దవకుండా, గింజ విరిగిపోకుండా చక్కగా పొడిపొడిగా వస్తుంది. మరోపక్క కొత్తిమీర, పుదీనా ఆకులను శుభ్రంగా కడిగి నీరు లేకుండా జల్లెడలో వేసి పక్కన పెట్టుకోవాలి.
తాలింపు & మసాలాల వేపుడు
అడుగు మందంగా ఉండే గిన్నెను స్టవ్‌పై పెట్టి 70 గ్రాముల నూనె లేదా డాల్డా వేసి వేడి చేయాలి. నూనె వేడెక్కాక బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, షాజీరా, జాపత్రి, యాలకులు, అనాస పువ్వు వేసి దోరగా వేయించాలి. ఆ వెంటనే పచ్చిమిర్చి చీలికలు, కొత్తిమీర, పుదీనా, అప్పటికప్పుడు రుబ్బుకున్న తాజా అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం పేస్ట్ అడుగు పట్టకుండా గరిటెతో తిప్పుతూ పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేయించుకోవాలి. వెజిటేరియన్ల కోసం అయితే ఈ దశలోనే కొద్దిగా క్యారెట్, బంగాళాదుంప ముక్కలు చేర్చుకోవచ్చు.
ఎసరు మరిగించడం
పోపు వేగిన తర్వాత నీటిని కొలత ప్రకారం పోసుకోవాలి. బియ్యం కొలిచిన గ్లాసుతోనే ఒక గ్లాసు బియ్యానికి ఒకటిన్నర గ్లాసుల చొప్పున నీటిని కలపాలి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, ఇంట్లోనే దోరగా వేయించి పొడి చేసుకున్న తాజా ధనియాల పొడిని వేసి బాగా కలపాలి. గిన్నెపై మూతపెట్టి ఎసరు బాగా మరిగేంత వరకు వేచి చూడాలి.
బియ్యం ఉడికించడం
ఎసరు తెర్లి మరుగుతున్న సమయంలో నానబెట్టిన బియ్యంలోని నీటిని పూర్తిగా వంపేసి గిన్నెలో వేయాలి. ఒకసారి నిదానంగా కలిపి మూతపెట్టి, బియ్యం దాదాపు 60% వరకు ఉడికేంత వరకు మీడియం మంటపై ఉంచాలి. నీరు దాదాపు ఇంకిపోయి, అన్నం పైభాగానికి తేలుతూ చిన్న చిన్న బుడగలు వస్తున్నప్పుడు అన్నాన్ని పైపైన సమానంగా సర్దుకోవాలి.
దమ్ వేయడం
బుడగలు వస్తున్న స్థితిలో స్టవ్ మంటను దీపం వెలుగులా చాలా చిన్నగా తగ్గించి మూతపెట్టాలి. ఇలా సన్నటి మంటపై సుమారు 10 నిమిషాల పాటు దమ్ చేయాలి. గిన్నె మూత అంచుల నుండి సన్నగా పొగలు రావడం మొదలైన వెంటనే స్టవ్ ఆపివేయాలి. స్టవ్ కట్టేసిన తర్వాత కూడా మూత తీయకుండా మరో 10 నిమిషాలు అలాగే వదిలేస్తే అన్నం లోపల ఉన్న వేడికి పూర్తిగా మగ్గుతుంది. ఆ తర్వాత మూత తీసి గరిటెతో అన్నాన్ని కింద నుండి పైకి సున్నితంగా తిరగేస్తే అసలైన ‘బగారా రైస్’ సిద్ధమవుతుంది.
తాజావార్తలు
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Medak Ddistrict: తూప్రాలో ఎర్ర లేఖ కలకలం.. ‘పోరాటం మరింత తీవ్రం చేస్తాం’ అంటూ హెచ్చరిక!
-
Indian Cinema: ‘బాహుబలి 2’ను కూడా వెనక్కి నెట్టిన పాత సినిమా.. 12 కోట్లకు పైగా టికెట్లు అమ్మి సరికొత్త రికార్డ్!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Project Cheetah Success: భారత్‌లో పెరిగిన చీతాల సంఖ్య.. 56కి చేరిక.. పర్యావరణానికి ఎందుకు కీలకం?
ట్రెండింగ్
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!
-
iPhone 18 Pro Max: ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఛార్జింగ్ టెస్ట్‌లో సంచలనం..