అవకాడో కాయ గురించి అందరికి తెలిసే ఉంటుంది.. ఈ కాయలను తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన పోషకాలు లభిస్తాయి.. అంతేకాదు వీటిలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి6, విటమిన్ ఇ, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్పరస్, జింక్, ఫోలేట్, ఒమేగా 3 ఉంటాయి.. అందుకే డాక్టర్లు ఎక్కువగా వీటిని తీసుకోవాలని సూచిస్తున్నారు.. అవకాడోను ఎలా తీసుకుంటే మంచి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
అవకాడోలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. జీర్ణాశయ సమస్యల్ని దూరం చేస్తుంది.. మలబద్ధకం గ్యాస్ వంటి సమస్యలను తగ్గిస్తుంది.. జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది.. అలాగే గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది.. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తాయి.. గుండె జబ్బులను రాకుండా చేస్తుంది..
వీటిలో ఎక్కువగా ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.. గ్లూకోజ్ శోషణని తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని ఎఫెక్ట్ చేసి ఇన్సులిన్ నిరోధకతని తగ్గిస్తుంది.. రోజుకు ఒకటి తీసుకున్నా మంచిదని నిపుణులు చెబుతున్నారు..
అవకాడో లో ఫైబర్ అధికంగా ఉంటుంది.. ఇది బరువును తగ్గించడంలో సహాయ పడుతుంది.. ఫైబర్ ఎక్కువ సేపు ఆకలి వెయ్యకుండా చేస్తుంది.. దాంతో సులువుగా బరువును తగ్గవచ్చు.. చర్మ రక్షణలో అవకాడో బెస్ట్ అనే చెప్పాలి.. చర్మ కణాల పెరుగుదలని ప్రోత్సహిస్తుంది. చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది.. అందంగా, మృదువుగా చేస్తుంది..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.