NTV Telugu Site icon

Asthma Patients Diet: ఆస్తమా పేషేంట్స్ ఈ పదార్థాలు అస్సలు తినకూడదు.. లేదంటే మూల్యం చెల్లించుకోవాల్సిందే!

Asthma Patients

Asthma Patients

Asthma Patients Does and Donts: వేసవి కాలం పోయి వర్షాకాలం మొదలైంది. వర్షాలు పడుతుండడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. దాంతో ఆస్తమా పేషేంట్స్ సమస్యలు పెరుగుతాయి. ఈ సీజన్‌లో చల్లని వాతావరణం, కూల్ పదార్థాలు తినడం కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. అందుకే ఆస్తమా పేషేంట్స్ తమను తాము ప్రత్యేకంగా చూసుకోవాలి. ఈ సమయంలో ఆస్తమా పేషేంట్స్ కొన్ని ఆరోగ్యకరమైన వాటిని మాత్రమే తీసుకోవాలి. ఆస్తమా పేషేంట్స్ ఏయే పదార్థాలు తినకూడదో ఇప్పుడు చూద్దాం.

చల్లని మరియు పుల్లని పదార్థాలు:
ఆస్తమా పేషేంట్స్ జలుబు, పులుపు పదార్థాలు తినకూడదు. ఐస్ క్రీం, చల్లటి నీరు, నిమ్మకాయ, పచ్చి పెరుగు వంటి వాటిని తీసుకోవడం వల్ల ఆస్తమా పెరుగుతుంది. ఆస్తమాపాటు పాటు దగ్గు సమస్య కూడా వచ్చే అవకాశం ఉంది. అందుకే ఆస్తమా పేషేంట్స్ వీటికి దూరంగా ఉండాలి.

Also Read: Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. ఐదవ రోజు తగ్గిన బంగారం ధరలు! తెలుగు రాష్ట్రాల్లో నేటి ధరలు ఇవే

టీ, కాఫీ:
చాలా మంది టీ, కాఫీలను రోజులో ఎక్కువగా తీసుకుంటారు. ఆస్తమా పేషెంట్లు మాత్రం టీ, కాఫీలు ఎక్కువగా తీసుకోకూడదు. ఎందుకంటే టీ లేదా కాఫీ ఆస్తమా పేషెంట్ల సమస్యను పెంచుతుంది. నిజానికి టీ మరియు కాఫీ తాగడం వల్ల గ్యాస్ సమస్య వస్తుంది. ఇది ఆస్తమా ప్రమాదాన్ని పెంచుతుంది.

ప్రిజర్వేటివ్‌ ఫుడ్:
ఆస్తమా పేషెంట్లు ప్రిజర్వేటివ్‌లను ఉపయోగించిన వాటిని అస్సలు తినకూడదు. పచ్చళ్లు, ప్యాక్డ్ జ్యూస్‌లు ఆస్తమా పేషేంట్స్ కష్టాలను రెట్టింపు చేస్తాయి.

Also Read: El Nino: ప్రాణాంతక వైరస్‌ల ప్రమాదం.. కారణం ఎల్ నినో.. డబ్ల్యూహెచ్ఓ వార్నింగ్

Show comments