ప్రస్తుతం యువత ఫిట్ నెస్ పై ఆసక్తి కనబరుస్తోంది. సన్నాగా, ఆరోగ్యంగా ఉండాలని యువత కోరుకుంటోంది. కాని మన ఆహారపు అలవాట్లు, లేదా పలు రకాల వ్యాధుల కారణంగా బరువు పెరుగుతుంటారు. ఆ బరువును తగ్గించుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. అలా చేసే వాటిలో కొన్ని మన ఆరోగ్యానికి అస్సలు మంచివి కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఊబకాయం, అధిక బరువు సమస్య ఎక్కువవుతోంది. దాని బారిన పడే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. దానికి జీవన శైలి, ఆహారపు అలవాట్లు, పలు సమస్యలు కారణమని తెలుస్తోంది. ఇలా బరువు తగ్గేందుకు అనేక ప్రయత్నాల్లో భాగంగా కొందరు రాత్రి భోజనం సైతం మానేస్తుంటారు. అలా చేస్తే ప్రమాదమని వైద్యులు చెబుతున్నారు. రాత్రి భోజనం చాలా ముఖ్యం.
పడుకునే ముందు శరీరానికి కావాల్సిన కీలకమైన కేలరీలు, పోషకాలను అందిస్తుంది. 24 గంటల్లో శరీరం ఎక్కువ సమయం తినకుండా నిద్రపోతుంది. కాబట్టి రాత్రి తప్పకుండా భోజనం చేయలని వైద్యులు చెబుతున్నారు. రాత్రి భోజనం మానేస్తే చాలా తక్కువ రోజుల్లో బరువు తగ్గొచ్చు కాని.. ఇది దీర్ఘకాలికంగా మంచిది కాదు. ఈ అలవాటు వల్ల రకరకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. ఇది మీ మొత్తం ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. రాత్రి భోజనం మానేయడం వల్ల ముఖ్యంగా జీవక్రియ దెబ్బతింటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఆకలి కోరికలు పెరగడంతో సూక్ష్మపోషకాల లోపానికి దారి తీస్తుంది. రాత్రి భోజనం తినకపోవడం వల్ల మీ నిద్ర నాణ్యతపై ప్రభావం చూపుతుంది. అందుకే కసరత్తులు చేస్తూ.. శరీర బరువును తగ్గించేందుకు కసరత్తులు చేయాలి. కాని ఇలా రాత్రి భోజనం మానేయడంతో లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దీంతో వేరే విధంగా బాడీ తగ్గించుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.