శీతాకాలం వచ్చిందంటే.. శరీరం చలికి వణికిపోతుంది. రాత్రి అయితే ఉష్ణోగ్రతలు మైనస్‌లో ఉండటంతో బాడీ చల్లబడిపోతుంది. ఉదయం 11 దాటిన వాతావరణం చల్లగానే ఉంటుంది. దీంతో వెచ్చదనం కోసం ఎన్నోన్నో ట్రై చేస్తుంటారు. చలి కాచుకోవడం, ఓళ్లంతా నూలు దుస్తులతో కప్పెసుకుంటారు. అయినా చలి గాలికి శరీరం వెంటనే చల్లగా అయిపోతుంది. దాంతో శరీరం కూల్ అయిపోతే పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి బాడీకి సరైన టెంపరేచర్ కావాలంటే ‘నాభి మర్మం’ చేసుకోవడం మంచిదంటూ ఆయుర్వేద నిపుణులు. ఇంతకి నాభి మర్మం అంటే ఏంటా? అని ఆలోచిస్తున్నారా? అయితే నాభి మర్మం అంటే ఏంటీ? దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో చూద్దాం!
Also Read: Covid Cases: మహారాష్ట్రలో కరోనా హడల్.. కొత్తగా 87 కేసులు నమోదు, ఇద్దరు మృతి
Musturd Oil
నాభి మర్మం చేయడం వల్ల రక్త ప్రసరణ బాగా మెరుగుపడుతుందట. ముఖ్యంగా చలికాలంలో నాభి మర్మం చేసుకోవడం వల్ల శరీరం వెచ్చగా ఉంటుందంటున్నారు ఆయుర్వేద నిపుణులు. ఈ నాభి మర్మం అంటే.. నాభి దగ్గర నూనెతో మర్ధన చేసుకోవడం. దీనివల్ల శరీరంలోని మొత్తం కండరాలకు రక్తప్రసరణ బాగా జరుగుతుంది. దీంతో బాడీ వెచ్చగా అవుతుందట. దానివల్ల బయట చల్లటి వాతావరణాన్ని తట్టుకునే శక్తి వస్తుందని చెబుతున్నారు నిపుణులు. అయితే అది ఆవ నూనెతో చేసుకోవడం మలైన ఫలితాలు ఉంటాయట. సాధారణం ఆవ నూనె వేడి అంటారు. అలాంటి ఆవ నూనెతో నాభి దగ్గర ప్రతి రోజు రాత్రి లేద వీలైన సమయంలో మర్ధన చేసుకోవడం వల్ల రక్తప్రసరణ జరిగి శరీరం వేడెక్కుతుంది.
Musturd Oil1
Also Read: Vishal: న్యూయార్క్ రోడ్డుపై అమ్మాయితో వీడియో.. అసలు విషయం ఓపెన్ అయిన విశాల్
అలాగే ఆవ నూనెలో ఔషధ గుణాలు దీర్ఘకాలిక వ్యాధులు కూడా ఎటాక్ చేయకుండా నియంత్రిస్తుందట. అలాగే చాలా మంది ఈ శీతా కాలంలో కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటి వారు ముందు నాభి చుట్టూ ఆవ నూనెతో మర్దనా చేసుకోవాలి. ఆ తర్వాత నొప్పులు ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో కూడా మసాజ్ చేసుకుంటే మంచి ఫలితాలను పొందుతారు. ఇలా వింటర్ సీజన్ లో ప్రతి రోజూ చేయడం వల్ల శాశ్వతంగా కీళ్ల నొప్పులు, కండరాల నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు.