Amazing Health Benefits : మీ ఇంట్లో ఈ గింజలు ఉన్నాయా? అయితే మీరు లక్కీ!
- బీపీ, గుండెకు సహజ రక్షణ
- షుగర్, కొలెస్ట్రాల్ కంట్రోల్‌లో సహాయం
- కీళ్ల నొప్పులు, వాపులకు ఉపశమనం
- సరైన మోతాదే ఆరోగ్యానికి మేలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కలోంజి గింజలు లేదా నల్ల జీలకర్ర గురించి మనం వింటూనే ఉంటాం. చిన్నగా, నల్లగా ఉండే ఈ గింజల్లో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయని ఆయుర్వేదం చెబుతోంది. అయితే, వీటిపై ఆధునిక వైద్యం ఏమంటోంది? డాక్టర్ సేథి వీటి గురించి షేర్ చేసిన వాస్తవాలు ఇవే:
1. రక్తపోటు (BP) కంట్రోల్
Also Read
- Kitchen Sink Tips: గిన్నెలు తోమేటప్పుడు బట్టలు తడుస్తున్నాయా? రూపాయి ఖర్చు లేకుండా ఈ 5 ట్రిక్స్ ట్రై చేయండి
- Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే "వెజ్ ఆమ్లెట్".. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
- Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
- Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
కలోంజి గింజలను తీసుకోవడం వల్ల రక్తపోటు తగ్గుతుందనేది నిజమని డాక్టర్ సేథి ధృవీకరించారు. ఇవి రక్త నాళాలను రిలాక్స్ చేసి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. దీనివల్ల హైపర్ టెన్షన్ తగ్గే అవకాశం ఉంది. అయితే, వీటితో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని కూడా పాటించాలి.
2. కొలెస్ట్రాల్ , గుండె ఆరోగ్యం
ఈ గింజలు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ (LDL) , ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. అదే సమయంలో మంచి కొలెస్ట్రాల్‌ను పెంచి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
3. షుగర్ వ్యాధిగ్రస్తులకు వరం
బ్లడ్ షుగర్ లెవల్స్‌ను తగ్గించడంలో కలోంజి అద్భుతంగా పనిచేస్తుంది. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచి, ఫాస్టింగ్ గ్లూకోజ్ లెవల్స్ తగ్గడానికి దోహదపడుతుంది. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి ఇది చాలా మేలు చేస్తుంది.
4. కీళ్ల నొప్పులు , ఆర్థరైటిస్
కలోంజిలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కీళ్ల నొప్పులు, వాపులను తగ్గించడంలో సహాయపడతాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఆస్తమా , అలర్జీలతో బాధపడేవారికి కూడా ఇవి ఊరటనిస్తాయి.
5. బరువు తగ్గడం – నిజమెంత?
చాలామంది కలోంజి తింటే బరువు తగ్గుతారని అనుకుంటారు. కానీ, డాక్టర్ సేథి ప్రకారం.. ఇవి నేరుగా బరువును తగ్గించవు. కేవలం బరువు తగ్గే ప్రక్రియకు సహకరిస్తాయి తప్ప, వీటిని తింటేనే బరువు తగ్గిపోతారన్నది వాస్తవం కాదు. సరైన డైట్ , వ్యాయామం తోడైతేనే ఫలితం ఉంటుంది.
6. లివర్ , కిడ్నీ ఆరోగ్యం
లివర్ , కిడ్నీలను రక్షించడంలో కూడా ఇవి కొంతవరకు సహాయపడతాయని, అయితే దీనిపై మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉందని డాక్టర్ తెలిపారు.
ఎలా తీసుకోవాలి? ఎంత తీసుకోవాలి?
- పరిమాణం: రోజుకు సగం నుండి ఒక టీస్పూన్ వరకు మాత్రమే తీసుకోవాలి. అతిగా తీసుకోవడం మంచిది కాదు.
- పద్ధతి: వీటిని నీటిలో నానబెట్టి తీసుకోవచ్చు, లేదా సలాడ్స్, కూరలు, చారు, పచ్చళ్లలో వేసుకుని తినవచ్చు.
ఏదైనా చికిత్సకు ప్రత్యామ్నాయంగా కాకుండా, ఆరోగ్యానికి మద్దతుగా మాత్రమే వీటిని వాడాలి. తీవ్రమైన సమస్యలు ఉన్నప్పుడు వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.
Ram Charan- Upasana: మెగా జంట రామ్ చరణ్, ఉపాసనకు.. బన్నీ ఎమోషనల్ విషెస్
తాజావార్తలు
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
Indian 3 : ఇండియన్ 3.. సేనాపతి తిరిగివస్తున్నాడు..
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Ramayana : ‘రామాయణ’ ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా ఆఫీసులపై ఐటీ శాఖ సోదాలు
ట్రెండింగ్
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!