Site icon NTV Telugu

Weight Loss Tips: నిమ్మరసంలో వీటిని కలిపి తాగితే చాలు.. 15 రోజుల్లో బరువు తగ్గుతారు…

Weight Loss

Weight Loss

ఈరోజుల్లో అధిక బరువు అనేది పెద్ద సమస్యగా మారింది.. బరువు ఎక్కువగా ఉండటం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాలి.. అందుకు బరువును తగ్గడం కోసం జనాలు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు.. రిజల్ట్ లేకపోవడం వల్ల ఆ నిరాశ చెందుతారు.. అలాంటి వారికి అద్భుతమైన చిట్కా ను తీసుకొచ్చాము.. అధిక బరువును తగ్గించడంలో చియా సీడ్స్ ఎంతో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ చియా సీడ్స్‌ని నీళ్లలో కానీ లేదా యుగర్ట్ లో కానీ నానబెట్టిన తినడం వల్ల వీటిలో అధిక మోతాదులో ఉండే ఫైబర్, రిచ్ ప్రోటీన్ శరీరానికి బలాన్ని ఇవ్వడమే కాకుండా ఎక్కువసేపు పొట్ట నిండుగా ఉన్న భావన కల్పిస్తాయి..మరి వీటిని ఎప్పుడూ తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

అయితే కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. చియా విత్తనాలలో ఫైబర్ ఉంటుంది. ఈ రెండూ కలిసి త్వరగా బరువు తగ్గడంలో సహాయపడతాయి. ఇందుకోసం ముందుగా ఒక గిన్నెలో చియా సీడ్స్, నీరు వేయండి. పుదీనా ఆకులు, నిమ్మరసం, తేనె కలపండి. ఇది 30 నిమిషాల తర్వాత పదార్థాలన్నీ మరోసారి కలపండి… ఆ తర్వాత దీన్ని తాగడం మంచిద అని నిపుణులు చెబుతున్నారు..

ఈ గింజలను తీసుకోవడం వల్ల శరీరంలోని కొవ్వును కరిగిస్తుంది. ఇది శరీరం నుండి వ్యర్థాలను, కొవ్వును తొలగించడానికి పనిచేస్తుంది. చియా గింజలను నిమ్మరసంలో కలిపి తాగడం వల్ల పొట్ట శుభ్రపడుతుంది. ఇవి జీవక్రియను పెంచుతాయి… ఆహారాన్ని త్వరగా జీర్ణం అయ్యేలా చేస్తుంది.. శరీరాన్ని చల్లగా ఉంచుతుంది.. అలాగే వేసవిలో దాహన్ని తీరుస్తుంది.. జుట్టు రాలే సమస్యలను దూరం చేస్తుంది.. ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి… పరగడుపున తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.

Exit mobile version