Site icon NTV Telugu

Alcohol : మందు తాగితే నిద్ర బాగా పడుతుందా? ఈ వాదనలో నిజమెంత…!

Alcohol

Alcohol

మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని టీవీల్లో, రేడియోల్లో రోజూ వినిపిస్తూనే ఉంటుంది. మందు బాటిళ్లపై కూడా మద్యం సేవించడం ప్రమాదకరం అని రాసి ఉంటుంది. కానీ ఎవరైనా వింటున్నారా? మన దేశంలో కష్టానికీ, మద్యానికీ విడదీయరాని బంధం ఉంది. రోజంతా కష్టపడే చాలా మంది సాయంత్రం కాగానే మద్యం బాటిల్ ఎత్తేస్తారు. సంపాదించిన కాస్త సొమ్ము మొత్తం మద్యానికి వాడేస్తారు. ఫలితంగా తాత్కాలిక కిక్కుతో పాటు అనారోగ్య సమస్యలను కూడా కొని తెచ్చుకుంటారు. అయితే.. మద్యం సేవిస్తే బాగా నిద్ర పడుతుందని కొందరు చెబుతుంటారు. అసలు ఇందులో నిమెంత? ఈ విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..

READ MORE: NIA Investigation: సిరాజ్‌, సమీర్‌ విచారణ.. బయటపడుతున్న కీలక విషయాలు

మందు తాగితే నిద్ర బాగా పడుతుందా? అనే ప్రశ్నకు కాదు అనే సమాధానం వస్తుంది. మద్యం తాగితే నిద్ర బాగా పడుతుందనేది ఓ అపోహ మాత్రమేనని నిపుణులు అంటున్నారు. అది ఒక గ్లాస్​ వైన్, విస్కీ, బీర్​.. ఇలా ఏదైనా నిద్ర పోయే ముందు మద్యం సేవించడం వృథా ప్రయాస అని చెబుతున్నారు. ఎందుకంటే.. మందు తాగడం వల్ల మత్తుతో నిద్రలోకి జారుకున్నా.. శరీరానికి సహజంగా అందాల్సిన విశ్రాంతి మాత్రం దొరకదని అంటున్నారు. నిద్రకు ముందు లిక్కర్ తీసుకుంటే అది మీ ఆర్​ఇఎమ్ నిద్రావస్థ (ర్యాపిడ్ ఐ మూవ్‌మెంట్)ను భంగపరుస్తుందని చెబుతున్నారు.

READ MORE: Rishabh Pant: పంత్ సూపర్ సెంచరీ.. గ్రౌండ్ లోనే స్పైడర్ మ్యాన్ లా పల్టీలు కొట్టి సెలబ్రేషన్స్

అంతే కాకుండా మందు తాగినప్పుడు మత్తుగా అనిపించి నిద్ర వచ్చినా.. కొద్దిసేపటి తర్వాత అంటే.. ఆల్కహాల్‌ శరీరంలో కలిసిపోయినప్పుడు ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది. దీనివల్ల మీరు తరచూ నిద్ర మేల్కొంటారని నిపుణులు పేర్కొన్నారు. దీని వల్ల మరుసటి రోజు అలసటగా ఉంటారని చెబుతున్నారు. ఇవి మాత్రమే కాకుండా.. మీరు ఎప్పుడు మందు తాగుతారు, ఎంత మోతాదులో సేవిస్తారు అనే అంశాలు కూడా నిద్రపై ప్రభావం చూపిస్తాయని అంటున్నారు.

Exit mobile version