Cancer Treatment: క్యాన్సర్ చికిత్సలో విప్లవం.. యశోద హాస్పిటల్‌లో MR-లినాక్ టెక్నాలజీ ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cancer Treatment: కేన్సర్ అంటే ఒకప్పుడు నయం చేయలేని రోగం. కానీ ఇపుడు కేన్సర్‌కు సైతం చికిత్స అందుబాటులోకి వచ్చింది. అలాగే కేన్సర్‌ను ప్రాథమిక స్థాయిలోనే కనుక గుర్తించ గలిగితే దానిని పూర్తి స్థాయిలో తగ్గించే అవకాశం ఉంది. అటువంటి చికిత్స ఇప్పుడు కేన్సర్‌కు అందుబాటులోకి వచ్చింది. అలాగే కేన్సర్ కూడా ఒకే రకమైన కేన్సర్‌గా ఉండటం లేదు. కేన్సర్‌లో ఎన్నో రకాల కేన్సర్‌లు ఉన్నాయి. ఎన్ని కేన్సర్‌లు ఉన్నా.. వాటికి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కొత్తగా వస్తున్న కేన్సర్లకు చికిత్స కోసం కొత్త కొత్త యంత్రాలను సైతం కనుగొంటున్నారు. కేన్సర్ చికిత్సకు కొత్త యంత్రాలు వస్తూనే ఉంటాయి. కొత్తగా ఒక సంస్థ కేన్సర్ చికిత్స కోసం అధునాతన యంత్రాన్ని అందుబాటులోకి తెచ్చింది. కేన్సర్ చికిత్సలో భాగంగా రేడియేషన్ థెరపీ కోసం అధునాతన యంత్రం ఎంఆర్ లినాక్(ఎంఆర్‌ఐ గైడెడ్ అడాప్టివ్ రేడియో థెరఫీ)ను అందుబాటులోకి తెచ్చినట్టు ఎలెక్టా వెల్లడించింద. దీన్ని దేశంలో తొలిసారిగా హైదరాబాద్ హైటెక్ సిటీలోని యశోదా ఆసుపత్రిలో ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపింది.
Read also: Divorce Temple: విడాకులు కావాలంటే ఈ గుడికి వెళ్లండి.. ఎక్కడో తెలుసా..?
Also Read
స్వీడన్‌కు చెందిన ఎలెక్టా కేన్సర్ రేడియో థెరఫీ చికిత్సను వినియోగించే యంత్రాలు, పరికరాలను ఉత్పత్తి చేస్తోంది. దేశంలో ఏటా 22 లక్షల మంది వరకు కొత్తగా కేన్సర్ బారిన పడుతున్నారని ఎలెక్టా ఇండియా మేనేజింగ్ డైరక్టర్ మనికందన్ చాలా తెలిపారు. ఈ నేపథ్యంలో కేన్సర్ చికిత్సలో రేడియో థెరపీ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. కొత్త సాంకేతికతతో అధునాతన యంత్రాలు, సాఫ్ట్ వేర్‌ను అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు. ఎలెక్టా యాక్సెస్ పేరుతో కేన్సర్ బాధితులకు అందుబాటులో, అత్యున్నత చికిత్స అందించే కార్యక్రమాన్ని ప్రారంభించామని వెల్లడించారు. దేశంలోనూ రేడియో థెరపీ యంత్రాలను ఉత్పత్తి చేసేందుకు కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు చూస్తున్నామన్నారు. ఇందులో తెలంగాణలోని మెడికల్ డివైజెస్ పార్కునూ పరిశీలించామని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!