NTV Telugu Site icon

Cancer Treatment: క్యాన్సర్ చికిత్సలో విప్లవం.. యశోద హాస్పిటల్‌లో MR-లినాక్ టెక్నాలజీ ప్రారంభం

Cancer Treatement

Cancer Treatement

Cancer Treatment: కేన్సర్ అంటే ఒకప్పుడు నయం చేయలేని రోగం. కానీ ఇపుడు కేన్సర్‌కు సైతం చికిత్స అందుబాటులోకి వచ్చింది. అలాగే కేన్సర్‌ను ప్రాథమిక స్థాయిలోనే కనుక గుర్తించ గలిగితే దానిని పూర్తి స్థాయిలో తగ్గించే అవకాశం ఉంది. అటువంటి చికిత్స ఇప్పుడు కేన్సర్‌కు అందుబాటులోకి వచ్చింది. అలాగే కేన్సర్‌ కూడా ఒకే రకమైన కేన్సర్‌గా ఉండటం లేదు. కేన్సర్‌లో ఎన్నో రకాల కేన్సర్‌లు ఉన్నాయి. ఎన్ని కేన్సర్‌లు ఉన్నా.. వాటికి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కొత్తగా వస్తున్న కేన్సర్లకు చికిత్స కోసం కొత్త కొత్త యంత్రాలను సైతం కనుగొంటున్నారు. కేన్సర్‌ చికిత్సకు కొత్త యంత్రాలు వస్తూనే ఉంటాయి. కొత్తగా ఒక సంస్థ కేన్సర్ చికిత్స కోసం అధునాతన యంత్రాన్ని అందుబాటులోకి తెచ్చింది. కేన్సర్ చికిత్సలో భాగంగా రేడియేషన్ థెరపీ కోసం అధునాతన యంత్రం ఎంఆర్‌ లినాక్‌(ఎంఆర్‌ఐ గైడెడ్‌ అడాప్టివ్‌ రేడియో థెరఫీ)ను అందుబాటులోకి తెచ్చినట్టు ఎలెక్టా వెల్లడించింద. దీన్ని దేశంలో తొలిసారిగా హైదరాబాద్‌ హైటెక్ సిటీలోని యశోదా ఆసుపత్రిలో ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపింది.

Read also: Divorce Temple: విడాకులు కావాలంటే ఈ గుడికి వెళ్లండి.. ఎక్కడో తెలుసా..?

స్వీడన్‌కు చెందిన ఎలెక్టా కేన్సర్‌ రేడియో థెరఫీ చికిత్సను వినియోగించే యంత్రాలు, పరికరాలను ఉత్పత్తి చేస్తోంది. దేశంలో ఏటా 22 లక్షల మంది వరకు కొత్తగా కేన్సర్‌ బారిన పడుతున్నారని ఎలెక్టా ఇండియా మేనేజింగ్‌ డైరక్టర్‌ మనికందన్‌ చాలా తెలిపారు. ఈ నేపథ్యంలో కేన్సర్‌ చికిత్సలో రేడియో థెరపీ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. కొత్త సాంకేతికతతో అధునాతన యంత్రాలు, సాఫ్ట్ వేర్‌ను అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు. ఎలెక్టా యాక్సెస్‌ పేరుతో కేన్సర్‌ బాధితులకు అందుబాటులో, అత్యున్నత చికిత్స అందించే కార్యక్రమాన్ని ప్రారంభించామని వెల్లడించారు. దేశంలోనూ రేడియో థెరపీ యంత్రాలను ఉత్పత్తి చేసేందుకు కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు చూస్తున్నామన్నారు. ఇందులో తెలంగాణలోని మెడికల్‌ డివైజెస్‌ పార్కునూ పరిశీలించామని పేర్కొన్నారు.

Show comments