Dangers of AC: ఏసీలు వాడుతున్నారా.? ఈ అనారోగ్య సమస్యల గురించి తెలుసుకోండి..
- ఏసీలు వాడుతున్న వారిలో తెలియకుండా అనారోగ్య సమస్యలు..
- డీహైడ్రేషన్, శ్వాసకోశ వ్యాధులతో ప్రమాదం..
- జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని సూచిస్తున్న వైద్యులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dangers of AC: దేశంలో ఎండలు విపరీతంగా పెరిగిపోయాయి. ఏప్రిల్ నెలలోనే ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు చేరింది. మేలో మరింత తీవ్రతతో భానుడు తన ప్రతాపాన్ని చూపించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో చాలా మంది తమ ఇళ్లలో ఏసీల వినియోగాన్ని పెంచారు. వేసవి వేడిమి నుంచి తప్పించుకోవడానికి చాలా మంది ఏసీలు కొనుగోలు చేస్తున్నారు. ఒకప్పుడు ఉన్నత వర్గాలకు మాత్రమే పరిమితమైన ఏసీలు ఇప్పుడు మధ్య తరగతి వారు కూడా కొనుగోలు చేస్తున్నారు. అయితే, ఏసీలు మన రూమ్ టెంపరేషన్‌ను తగ్గించి, మనకు సుఖాన్ని ఇస్తున్నప్పటికీ వీటి వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చాలా మందికి తెలియకుండానే డీహైడ్రేషన్, అలసట, శ్వాస సమస్యలు, ఇమ్యూనిటీ తగ్గడం లాంటి సమస్యలు వస్తాయి.
డీహైడ్రేషన్:
Also Read
- Kakarakaya Vepudu: అన్నంలోకి 'కాకరకాయ వేపుడు'.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
- Plastic Bucket Cleaning Tips: ప్లాస్టిక్ బకెట్లపై జిడ్డు మరకలా? కొత్తదానిలా మెరిపించే సింపుల్ టిప్స్..
- Eye Health: తరచూ హెడేక్ వస్తోందా? ఎప్పుడు అలర్ట్ కావాలి? వైద్యుల సలహా ఇదే!
- How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
ఏసీ గాలిలోని తేమను తగ్గిస్తుంది. వాతావరణం పొడిగా మారుతుంది. దీంతో మనకు దాహం అనిపించదు. నీరు తక్కువగా తాగుతారు. మనకు తెలియకుండానే మన శరీరానికి కావాల్సిన నీరు అందదు. ఇలాంటి సమయంలో డీహైడ్రేషన్ ఏర్పడి తల నొప్పి, అలసట, పొడి చర్మ, ఏకాగ్రతా లోపాలు ఏర్పడుతాయి.
శ్వాసకోశ వ్యవస్థపై ప్రభావం:
చల్లని, పొడి గాలి వల్ల శ్వాసకోశ వ్యవస్థ కూడా చికాకు పడుతుంది. ఏసీ వాతావరణంలో ఎక్కువగా గడిపే వారు గొంతు పొడిగా మారడం, దగ్గు, ముక్కు దిబ్బడ, శ్వాసకోశ వ్యవస్థ చికాకు పడటం వంటి సమస్యల్ని ఎదుర్కొంటారు. ఆస్తమా, అలర్జీలు, సైనస్ సమస్యలు ఉన్న వారికి ఇది మరింత ప్రమాదకరంగా మారుతుంది. ఏసీ యూనిట్లు ఉన్న గదులు పూర్తిగా మూసి ఉంటాయి. దీని వల్ల దమ్ము, అలర్జీ కారకాలు, బ్యాక్టీరియా వ్యాపిస్తాయి. ఇది పరిస్థితి తీవ్రతను మరింత పెంచుతుంది.
టెంపరేచర్ షాక్:
ఏసీల వల్ల కొందరు ‘‘టెంపరేచర్ షాక్’’ అనే సమస్యను ఎదుర్కొంటారు. శరీరం బయట తీవ్రమైన వేడి నుంచి లోపల చల్లని వాతావరణానికి మారినప్పుడు ఉష్ణోగ్రతల్లో మార్పు వల్ల శరీరం ఒత్తిడికి గురవుతుంది. శరీరం ఆ ఉష్ణోగ్రతలకు అలవాటు పడటంతో ఇబ్బంది పడుతుంది. దీని వల్ల అలసట, తలనొప్పి, కండరాలు బిగుసుకుపోవడం, కొన్ని సందర్భాల్లో ఇమ్యూనిటీ తగ్గడం వంటివి జరుగుతాయి.
ఇలా చేస్తే సమస్యలకు చెక్:
ఎయిర్ కండిషనర్‌ను పూర్తిగా మారేయాల్సిన పని లేదు. ఏసీని 24-26 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద సెట్ చేసుకోవాలి. శరీరంలో నీరు తగ్గకుండా దాహం వేయకపోయినా నీరు తాగాలి. నేరుగా ఏసీ గాలి శరీరానికి తగలకుండా చూసుకోవాలి.
తాజావార్తలు
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
-
France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
-
Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!