Site icon NTV Telugu

Viral News: అబ్బాయిలూ.. విన్నారా? అమ్మాయిలకు యావరేజ్ పోరగాళ్లే నచ్చుతారట!

Love

Love

అమ్మాలకు నచ్చాలంటే ఆరడుగుల పొడవు.. సిక్స్ ప్యాక్ బాడీ.. నిగనిగలాడే రంగుతో ఉండాలని అందరం అభిప్రాయపడుతుంటాం.. అందమైన అమ్మాయిలకు నచ్చడానికి పుట్టుకతో రాని రంగు, హైట్‌ని పొందేందుకు నానా తంటాలు పడుతుంటారు. కానీ..తాజాగా వచ్చిన ఓ నివేదిక చదివితే.. “ఇదెక్కడి మాస్ రా..మావా” అనుకోక తప్పదు.. ఎందుకంటే ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో అమ్మాయిలు యావరేజ్ అబ్బాలనే ఎక్కువగా ఇష్టపడుతున్నారట. అందగాళ్లను ఆ పూటకు చూసి నేత్రానందం పొందుతారట.. అందంగా ఉండే యువకులకు దగ్గరయ్యేందుకు యుతులు ఆలోచించడం ప్రారంభిస్తారట..

READ MORE: Hassan Nasrallah: నస్రల్లాతో సహా హిజ్బుల్లా 9 మంది కమాండర్లు హతం.. తర్వాతి నాయకుడు ఇతడేనా..?

“నేను అతడికి నచ్చుతానో లేదో.. ఇంతకు ముందే ఎవరితోనైనా రిలేషన్ లో ఉండేఉంటాడు. ఒకవేళ నేను ప్రపోజ్ చేసిన తర్వాత నన్ను రిజెక్ట్ చేస్తే.. ఇంత అందంగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు రిలేషన్ లో లేకపోయినా.. గతంలో అయినా.. ఉండేఉంటాడు” అని ఆలోచిస్తారట. అదే సాదాసీదాగా.. కాస్త పక్కింటి అబ్బాయి ఫీచర్లు ఉన్నవారితో సులభంగా మాట కలిపేందుకు ధైర్యం చూపుతారట. అంతే కాదు కొన్ని సినిమాల్లో చూయించినట్లు మారీ ఎక్కువ గడ్డం ఉన్నవారు కూడా అంతగా నచ్చరట. లేలేత గడ్డం కలిగిన పోరగాళ్లంటే బాగా ఇష్టపడతారట. పెంపుడు జంతువుల పట్ల విరక్తి చూయించినా.. మనీ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినా.. అంతగా నచ్చరని సర్వే పేర్కొంది. తమకంటే వయసులో కొంత పెద్దవాడై ఉండి.. డస్కీ కలర్‌లో కాసింత హైట్‌తో.. కుటుంబాన్ని జాగ్రత్తగా పోషించే స్తోమత కలిగిన వారిని ప్రస్తుతం అమ్మాయిలు బాగా ఇష్టపడుతున్నారని తేలింది. ఈ లక్షణాలు మీలో ఉంటే.. మీ కోసం కూడా ఎక్కడో ఒకచోట అందాల రాసి ఎదురు చూస్తునే ఉంటుంది.

Exit mobile version