Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Ssc Class 10 Hall Tickets Out Telangana And Maths Preparation For Telugu States Students

SSC Maths Study Tips: టెన్త్ పరీక్షలకు రెడీనా? మ్యాథ్స్ టెన్షన్ తగ్గించే సూపర్ స్టడీ టిప్స్ మీ కోసం..

Published Date :March 6, 2026 , 10:53 am
By RAMAKRISHNA KENCHE
SSC Maths Study Tips: టెన్త్ పరీక్షలకు రెడీనా? మ్యాథ్స్ టెన్షన్ తగ్గించే సూపర్ స్టడీ టిప్స్ మీ కోసం..
  • Follow Us :
  • google news
  • dailyhunt

TS-AP SSC Exams: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి విద్యార్థుల సర్వం సిద్ధమైంది. తెలంగాణ(Telangana)లో ఇప్పటికే ఎస్‌ఎస్‌సీ హాల్ టికెట్లు(SSC Hall Tickets) విడుదలయ్యాయి. పరీక్షల కౌంట్‌డౌన్ షురూ అయ్యింది. టీజీలో మార్చి 14 నుంచి పరీక్షలు ప్రారంభం కానుండగా, ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో మార్చి 16 నుంచి పరీక్షల పర్వం స్టార్ట్ కానుంది. ఈ పరీక్షల నేపథ్యంలో చాలా మంది విద్యార్థుల మనసుల్లో ఒకే భావన తిరుగుతూ ఉంటుంది. అన్ని సబ్జెక్టులు ఒకలా అనిపించినా ఒక సబ్జెక్ట్ మాత్రం గుండెల్లో చిన్న టెన్షన్‌ను పెంచుతుంది. అదే మ్యాథ్స్(Maths). కొందరికి అది ఫ్రెండ్‌లా మారుతుంటే.. మరి కొందరికి భూతంలా కనిపిస్తోంది. పరీక్ష పేపర్‌లో అంకెలు, సంఖ్యలు కనిపిస్తే చాలా గుండె ఇంకొంచెం వేగంగా కొట్టుకోవడం మొదలవుతుంది. లెక్కలు, తదితర పాఠాలు మరింత ఒత్తిడిని పెంచుతాయి. కానీ నిజానికి మ్యాథ్స్‌ భయపెట్టే సబ్జెక్ట్ కాదు.. దీన్ని మనసు పెట్టి అర్థం చేసుకుంటే చాలా సులువుగా ఉంటుంది. ఈ మ్యాథ్స్‌ను ఈజీగా ఎలా అర్థం చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

READ MORE: Pink Ball Test: ఆస్ట్రేలియా గడ్డపై భారత్ సత్తా చాటుతుందా? నేటి నుంచే ఏకైక పింక్ బాల్ టెస్ట్!

Also Read

  • Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
  • UGC Net: యూజీసీ నెట్ నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలు ఇవే..
  • Union Bank Recruitment 2026: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1865 పోస్టులు.. మంచి జీతం
  • SSC Stenographer: ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. 731 స్టెనోగ్రాఫర్ పోస్టులకు రిజిస్ట్రేషన్ ప్రారంభం

మ్యాథ్స్‌ లేని జీవితం లేదు:
మన జీవన శైలిలో మ్యాథ్స్ సర్వసాధారణం. ఉదయం గడియారం మోగే సమయం నుంచి రాత్రి నిద్రపోయే సమయం వరకు సంఖ్యలే మన రోజును నడిపిస్తాయి. బస్సు టైమ్ చూసుకోవడం, మార్కెట్‌లో వస్తువుల ధరలు, ఇల్లు కట్టాలంటే కొలతలు, రోడ్డు వేయాలంటే కోణాలు, వంతెన నిలవాలంటే లెక్కలు అన్నీ గణితానికి సంబంధించినవే. ప్రపంచం ముందుకు నడవడానికి కనిపించని ఒకే ఒక్క శక్తి మ్యాథ్స్. అందుకే గణితం కేవలం పుస్తకాల్లో ఉండే సబ్జెక్ట్ కాదు. అది జీవితాన్ని నడిచే ఒక తత్వం. ఇలాంటి సబ్జెక్ట్‌ను ఈజీగా మారల్చుకోవాలంటే.. సింపుల్ టిప్స్ గురించి తెలుసుకుందాం..

ప్రాక్టీస్‌ మేక్‌ ఎవ్రి వన్‌ పర్ఫెక్ట్:
మ్యాథ్స్ ప్రాక్టీస్‌ చేసేటప్పుడు మొదట మనసులోని భయాన్ని తగ్గించుకోవడం చాలా ముఖ్యం. చాలా మంది విద్యార్థులు ఒక పొరపాటు చేస్తారు. ప్రాబ్లెమ్‌ను ఒకసారి చూసి అర్థం కాలేదంటే వెంటనే దాన్ని కష్టమని తేల్చేస్తుంటారు. కానీ మ్యాథ్స్‌ అసలు మంత్రం ఒక్కటే.. అదే ప్రాక్టీస్. ఒక ప్రాబ్లెమ్‌ను ఒకసారి చేయడం కంటే రెండు సార్లు చేయడం మంచిది. రెండు సార్లు కంటే మూడు సార్లు చేయడం ఇంకా మంచిది. ప్రతి దశను నెమ్మదిగా రాస్తూ, ఎందుకు ఇలా వస్తుందో అర్థం చేసుకుంటూ చేస్తే మెదడు ఆ విధానాన్ని గుర్తుపెట్టుకుంటుంది. అప్పుడు అదే తరహా లెక్క మరోసారి కనిపించినా భయం ఉండదు. ముఖ్యంగా షార్ట్‌ కట్స్‌ జోలికి పోవద్దు.. అసలైన బెసిక్‌ మోడల్‌నే ముందుగా నేర్చుకోవాలి.

మూడు సార్లు చేయాలి:
మ్యాథ్స్‌ ప్రిపేర్ అయ్యేటప్పుడు ప్రాబ్లెమ్‌ను కేవలం చూసి అర్థం చేసుకుంటే సరిపోదు. చేతితో రాయాలి. పెన్ పేపర్‌పై నడిస్తేనే మెదడు కూడా పని చేస్తుంది. ప్రతి స్టెప్ రాస్తూ ముందుకు వెళ్లడం వల్ల తప్పులు ఎక్కడ జరుగుతున్నాయో స్పష్టంగా తెలుస్తుంది. చిన్న తప్పులు కూడా గమనించడం అలవాటు అయితే మార్కులు కూడా పెరుగుతాయి.

ముందుగా ఈజీ క్వశ్చన్స్‌తో స్టార్ట్ చేయండి:
పరీక్షా హాల్లోకి వెళ్లినప్పుడు కూడా ఒక చిన్న వ్యూహం ఉంటే మ్యాథ్స్‌ చాలా ఈజీగా అనిపిస్తుంది. క్వశ్చన్ పేపర్ తీసుకున్న వెంటనే మొత్తం పేపర్‌ను ఒకసారి ప్రశాంతంగా చూడాలి. వెంటనే కష్టమైన ప్రశ్నలపై ఆలోచించకుండా ఈజీగా అనిపించే క్వశ్చన్‌తో ప్రారంభించాలి. మొదటి కొన్ని ప్రాబ్లెమ్స్‌ వచ్చాయంటే మనసులో ధైర్యం పెరుగుతుంది. ఆ ధైర్యం తర్వాతి ప్రాబ్లెమ్స్‌ను కూడా సులభంగా చేయిస్తుంది. మ్యాథ్స్‌ అనేది మెదడు ఆలోచనల ప్రవాహం లాంటిది. ఒకసారి అది సరిగ్గా నడవడం మొదలైతే లెక్కలు వరుసగా చేస్తూ వెళ్లిపోవచ్చు.

పరీక్ష ఎప్పుడంటే?
తెలంగాణలో మ్యాథ్స్‌ పరీక్ష మార్చి 28న జరగబోతోంది. ఆంధ్రప్రదేశ్‌లో మార్చి 23న ఉంది. ఈ కొద్దీ రోజులను టెన్షన్‌తో కాకుండా ప్రాక్టీస్‌తో నింపుకుంటే మ్యాథ్స్ మనకు పెద్ద బలం అవుతుంది. రోజుకు కొంత సమయం కేటాయించి పాత ప్రశ్నాపత్రాలు చూసి ప్రాక్టీస్‌ చేస్తే చాలా ఉపయోగం ఉంటుంది. నిజానికి సంఖ్యలు మనతో మాట్లాడటం మొదలుపెట్టినప్పుడు మ్యాథ్స్ అందంగా కనిపిస్తుంది. లెక్కలు క్రమంగా కుదిరినప్పుడు ఒక చిన్న ఆనందం మనసులో పుడుతుంది. ఆ ఆనందమే మ్యాథ్స్‌ మనకు ఇచ్చే అందం. భయం తగ్గి ప్రాక్టీస్‌ పెరిగితే మ్యాథ్స్‌ కూడా మనకు మంచి మార్కుల రూపంలో నవ్వుతుంది. ఈ నంబర్స్‌ వరల్డ్‌ను డేర్‌గా ఎదుర్కొంటే విజయానికి దారి కూడా అదే సంఖ్యలు చూపిస్తాయి.

 

 

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • AP SSC 2026
  • Class 10 Maths Tips
  • Exam Tips
  • Maths Preparation
  • SSC Maths Study Tips

తాజావార్తలు

  • Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..

  • Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?

  • Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?

  • GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్‌లో భారీగా జీఎస్టీ వసూళ్లు..

  • Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్‌గా చేసేయండి!

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions