SBI Recruitment 2023: నిరుద్యోగులకు గుడ్ న్యూస్..రూ.75 లక్షల జీతం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ దేశీయ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. తాజాగా మరో నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది.. మొత్తం 28 స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది..మూడేళ్ల కాంట్రాక్ట్ తో వీటిని భర్తీ చేస్తామని, మరో రెండేళ్లు తర్వాత కాంట్రాక్ట్ పొడిగించే అవకాశం ఉందని ఎస్బీఐ పేర్కొంది. ఈ జాబ్ కు సెలెక్ట్ అయిన వారికి రూ.75 లక్షల జీతం ఇస్తామని నోటిఫికేషన్ లో పేర్కొంది..అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, వారిని ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తారు. ఈ మెయిల్ ద్వారా ఇంటర్వ్యూ సమాచారం అందిస్తారు.. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు..
వైస్ ప్రెసిడెంట్ (ట్రాన్స్ఫార్మేషన్)- 1 పోస్టు..
సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్- ప్రోగ్రామ్ మేనేజర్- 4 పోస్టులు..
సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్- క్వాలిటీ అండ్ ట్రైనింగ్ (ఇన్‌బౌండ్ అండ్ ఔట్‌బౌండ్)- 1 పోస్టు..
సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్- కమాండ్ సెంటర్ – 3 పోస్టులు..
సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అండ్ హెడ్ (మార్కెటింగ్)- 1 పోస్టు..
అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (మార్కెటింగ్)/ చీఫ్ మేనేజర్ (మార్కెటింగ్)- 18 పోస్టులు..
Also Read
- SSC Memos: మార్చి, జూన్ 2026 పరీక్షల్లో పాసైన ‘పది’ విద్యార్థులకు అలర్ట్.. రేపు సర్టిఫికేట్ల పంపిణీ..
- India Post GDS : పదో తరగతితో పోస్ట్ఆఫీస్ జాబ్.. 25 వేలకుపైగా పోస్టులు
- Onkar Batra: 7ఏళ్లకే వెబ్సైట్.. 20ఏళ్లకే శాటిలైట్.. కశ్మీర్ యువకుడి సక్సెస్ స్టోరీ!
- Reservation Roster: డాక్టర్ల నియామకంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం!
ఒక్కో జాబ్ కు ఒక్కో వయస్సు ఉంటుంది.. ముఖ్యంగా 35 ఏళ్ల నుంచి 45 ఏళ్ల వయస్సును కలిగి ఉండాలి..షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ. ద్వారా సెలెక్ట్ చేస్తారు.. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థుల ఫీజు రూ. 750 చెల్లించాలి.. ఇక ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఉచితం..
అర్హతలు :
*. సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అండ్ హెడ్ (మార్కెటింగ్) పోస్టుకు ఎంబీఏ/పీజీడీఎం లేదా ఎంబీఏ(మార్కెటింగ్) ఫైనాన్స్ ఒక సబ్జెక్టుగా లేదా ఎంబీఏ(ఫైనాన్స్) మార్కెటింగ్ ఒక సబ్జెక్టుగా లేదా ఎంబీఏ(డ్యూయల్) ఫైనాన్స్ అండ్ మార్కెటింగ్.
*. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (మార్కెటింగ్)/ చీఫ్ మేనేజర్ (మార్కెటింగ్) ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఎంబీఏ/పీజీడీబీఎం లేదా మార్కెటింగ్/ఫైనాన్స్ సబ్జెక్టుల్లో స్పెషలైజేషన్ చేసి ఉండాలి.
*. సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్- ప్రోగ్రామ్ మేనేజర్, సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్- క్వాలిటీ అండ్ ట్రైనింగ్ (ఇన్‌బౌండ్ అండ్ ఔట్‌బౌండ్), సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్- కమాండ్ సెంటర్ పోస్టులకు కనీసం డిగ్రీ అయిన చదివి ఉండాలి..
దరఖాస్తు విధానం :
ఎస్బీఐ అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తునకు చివరి తేది 2023 జూలై 2.. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నోటిఫికేషన్ ను బాగా చదివి అప్లై చెయ్యగలరు..
తాజావార్తలు
-
Deepti Sharma: దీప్తి శర్మ ప్రపంచ రికార్డు.. 7 బంతుల్లో 3 వికెట్లు, టీ20లో నంబర్-1 బౌలర్‌గా..
-
Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
-
Brad Pitt : ఏంజెలీనా జోలీని వివాహం చేసుకోవడమే నా జీవితంలో అతిపెద్ద తప్పు
-
Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
-
Rahul Gandhi: రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్.. హల్ద్వానీ ‘శుద్ధీకరణ’ వివాదంలో కేసు నమోదు
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!