Results : రైల్వే లోకో పైలట్ (RRB ALP) 2024 సీబీటీ–2 పరీక్ష ఫలితాలను బుధవారం (జులై 2) రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు విడుదల చేసింది. పరీక్ష రాసిన అభ్యర్థులు RRB అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ హాల్‌టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలతో ఫలితాలు చూసుకోవచ్చు. అలాగే జులై 2 నుంచి 7వ తేదీ వరకు స్కోర్‌కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
కటాఫ్ మార్కులు ఇలా ఉన్నాయి:
ఈ కటాఫ్ మార్కుల ఆధారంగా అర్హత పొందిన అభ్యర్థులకు జులై 15న ఆప్టిట్యూడ్ టెస్ట్ నిర్వహించనున్నట్లు బోర్డు ప్రకటించింది.
18,799 ALP ఖాళీల భర్తీ ప్రక్రియలో భాగంగా…
దేశవ్యాప్తంగా రైల్వే జోన్లలో 18,799 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీ కోసం ఆర్‌ఆర్‌బీ ఈ నియామక ప్రక్రియను చేపట్టింది. ఇందులో సికింద్రాబాద్ రైల్వే జోన్‌లో 2,528 పోస్టులు ఉన్నాయి.
NTPC గ్రాడ్యుయేట్ పోస్టులపై ప్రాథమిక కీ విడుదల
ఇంతేకాక, ఆర్‌ఆర్‌బీ నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ (NTPC) గ్రాడ్యుయేట్ పోస్టులకు సంబంధించి ఇటీవల నిర్వహించిన CBT-1 పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీ కూడా విడుదల చేసింది. అభ్యర్థులు తమ ప్రశ్నపత్రం, రెస్పాన్స్ షీట్‌లను వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. ప్రాథమిక కీపై అభ్యంతరాలు వ్యక్తం చేయడానికి జులై 6 వరకు అవకాశం ఉంది. అభ్యంతరానికి రూ.50 ఫీజుతో పాటు సరైన ఆధారాలు అందజేయాల్సి ఉంటుంది.
దేశవ్యాప్తంగా 11,558 పోస్టుల భర్తీకి ప్రక్రియ
ఈసారి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు మొత్తం 11,558 NTPC పోస్టుల భర్తీకి ప్రక్రియ ప్రారంభించింది. ఇందులో 8,113 గ్రాడ్యుయేట్, 3,445 అండర్‌గ్రాడ్యుయేట్ పోస్టులు ఉన్నాయి.
రిజల్ట్ లింక్ : https://www.rrbapply.gov.in