Postal Jobs : పోస్టల్ శాఖలో 30 వేలకు పైగా ఉద్యోగాలు.. పది అర్హతతో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. తాజాగా పోస్టల్ లో ఖాళీలు ఉన్నట్లు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ప్రకారం 30 వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాలకు ఇండియా పోస్ట్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ లో indiapostgdsonline.gov.in వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ నోటిఫికేషన్ ప్రకారం 30041 గ్రామీణ డాక్ సేవక్ పోస్ట్ లను భర్తీ చేయడానికి ఇండియా పోస్ట్ సన్నాహాలు చేస్తోంది. ఈ పోస్ట్ లకు అర్హత కేవలం పదవ తరగతి పాస్ కావడమే. దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆగస్ట్ 23 లోగా ఆన్ లైన్ లో indiapostgdsonline.gov.in వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఆ తరువాత ఆగస్ట్ 24 నుంచి ఆగస్ట్ 26 వరకు తమ అప్లికేషన్ లో తప్పొప్పులను సరి చేసుకునే అవకాశం ఉంటుంది..
Also Read
- Explainer: ఉద్యోగాల కోసం ఎదురుచూపులు.. ఆగిపోతున్న గుండెలు.. ఇంకెన్నాళ్లీ బాధలు?
- NTA Recruitment: ఉద్యోగార్థులకు అలెర్ట్.. కంటెంట్, మీడియా, రీసెర్చ్, ఫైనాన్స్‌లో జాబ్స్‌కి నోటిఫికేషన్..!
- ISRO Recruitment: ఇంజనీరింగ్ అభ్యర్థులకు గోల్డెన్ ఛాన్స్.. ఇస్రోలో జాబ్స్‌కి నోటిఫికేషన్!
- TG Education: స్కూల్ ఫీజుల నియంత్రణపై కీలక అడుగు.. ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ..
ఈ ఉద్యోగాలకు అప్లై చేసేకొనే వాళ్ళు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10 వతరగతి పాస్ అయిన వారు ఈ పోస్ట్ లకు అప్లై చేయడానికి అర్హులు. అయతే, వారు 10వ తరగతిలో గణితం, ఇంగ్లీష్, స్థానిక భాష కచ్చితంగా చదివి ఉండాలి. ఈ పోస్ట్ లకు అప్లై చేయడానికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. అభ్యర్థులు రూ. 100 అప్లికేషన్ ఫీజుగా చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, ట్రాన్స్ విమన్, దివ్యాంగులు అప్లికేషన్ ఎటువంటి ఫీజు చెల్లించనక్కర లేదు..
ఈ ఉద్యోగాలకు ఎలా అప్లై చేసుకోవాలంటే?
ముందుగా indiapostgdsonline.gov.in వెబ్ సైట్ ఓపెన్ చేయాలి.
హోం పేజీపై కనిపిస్తున్న registration లింక్ పై క్లిక్ చేయాలి.
వ్యక్తిగత వివరాలతో రిజిస్టర్ చేసుకోవాలి.
అప్లికేషన్ ఫామ్ ను నింపాలి. అవసరమైన డాక్యుమెంట్లను అప్ లోడ్ చేయాలి.
అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
అప్లికేషన్ ఫామ్ ను సబ్మిట్ చేయాలి.
భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకోవాలి..
ఆసక్తి కలిగిన వాళ్ళు నోటిఫికేషన్ పూర్తిగా చదివి అప్లై చేసుకోవాలి..
తాజావార్తలు
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
Speaker Ayyanna Patrudu: ఎమ్మెల్యేల హాజరుకు ఇక కెమెరాలే సాక్ష్యం.. స్పీకర్ అయ్యన్న సంచలన నిర్ణయం
-
Priyanka Chopra : ప్రియాంకా చోప్రా గ్లోబల్ బ్రాండ్ ఇంత స్ట్రాంగ్‌గా ఎలా మారింది?
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడి రహస్య ప్రయాణం.. అసలు కారణం ఇదే!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..