టెన్త్ పాసై ఖాళీగా ఉన్నారా? పదో తరగతి అర్హతతో గవర్నమెంట్ జాబ్స్ ఉంటే బాగున్ను అని ఆలోచిస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఏకంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందే అవకాశం వచ్చింది. జస్ట్ మీరు టెన్త్ పాసైతే చాలు కానిస్టేబుల్ జాబ్ ను సొంతం చేసుకోవచ్చు. తాజాగా కేంద్ర మంత్రిత్వ శాఖ ఆద్వార్యంలోని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కానిస్టేబుల్/డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 1124 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో కానిస్టేబుల్/ డ్రైవర్ పోస్టులు 845, కానిస్టేబుల్/డ్రైవర్ కం పంప్ ఆపరేటర్ 279 పోస్టులున్నాయి.
సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్/డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్ పోస్టులకు అప్లై చేసుకోదలిచిన వారు ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ నుంచి టెన్త్ ఉత్తీర్ణులై ఉండాలి. దీనితో పాటు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్, డ్రైవింగ్ అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్థుల వయసు 04/03/2025నాటికి 21 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. శారీరక ప్రమాణాల విషయానికి వస్తే.. ఎత్తు 167 సెం.మీలు, ఛాతి 80-85 సెం.మీలు కలిగి ఉండాలి. ఈ ఉద్యోగాలకు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఎంపికైన వారికి నెలకు రూ. 21,700 నుంచి 69,100 జీతం అందిస్తారు. దరఖాస్తు ఫీజు రూ. 100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఈఎస్ఎం అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు కల్పించారు. అప్లికేషన్ ప్రక్రియ ఫిబ్రవరి 3 నుంచి ప్రారంభం కానున్నది. అర్హత, ఆసక్తి ఉన్నవారు మార్చి 4 వరకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం ఈ లింక్ cisfrectt.cisf.gov.in పై క్లిక్ చేయండి. ప్రభుత్వ ఉద్యోగాలే లక్ష్యంగా సన్నద్ధమవుతున్న వారు ఈ ఛాన్స్ ను మిస్ చేసుకోకండి.