Site icon NTV Telugu

మెడికల్, ఇంజనీరింగ్, ఐటీఐ విద్యార్థులకు గుడ్ న్యూస్.. వారందరికి LIC Golden Jubilee Scholarship 2025

Lic

Lic

LIC Golden Jubilee Scholarship 2025: మనలో ఒకరం లేదా మన చుట్టూ ఉండేవారిలో ఎందరో చదువులో ప్రతిభ ఉన్నా కానీ వారి ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోవడంతో అనేక మంది విద్యార్థులు తమ చదువును కొనసాగించలేకపోతున్నారు. అలాంటి ప్రతిభావంతుల విద్యార్థులకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ ప్రతి సంవత్సరం స్కాలర్‌షిప్ అందిస్తోంది. ఈ స్కాలర్‌షిప్ ద్వారా మెడికల్, ఇంజనీరింగ్, అండర్‌ గ్రాడ్యుయేట్ కోర్సులైన డిప్లొమా, ఐటీఐ వంటి చదువులను కొనసాగించేందుకు విద్యార్థులకు సహాయం లభిస్తుంది.

Kaleshwaram Project: గత ప్రభుత్వ జీవో రద్దు చేయకున్నా.. సీబీఐకి కాళేశ్వరం ప్రాజెక్టు కేసు, ఎలాగంటే?

ఇకప్తో గతసారి కంటే ఈసారి ఈ LIC గోల్డెన్ జూబిలీ ఫౌండేషన్ స్కాలర్‌షిప్ పరిధిని మూడు రెట్లు పెంచింది. ఇందులో భాగంగా 2025లో 11,200 మంది విద్యార్థులకు ఈ స్కాలర్‌షిప్ లభించనుంది. దీంతో డబ్బుల కొరత కారణంగా చదువు ఆపాల్సి వస్తున్న అనేక మంది విద్యార్థులకు ఇది గొప్ప సహకారం కానుంది. అయితే ఇది ఎవరికీ ఇస్తారన్న విషయానికి వస్తే.. 10వ, 12వ లేదా డిప్లొమా పరీక్షల్లో మంచి మార్కులు (కనీసం 60% మార్కులు లేదా సమానమైన CGPA) సాధించినవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ పరీక్షలను 2022-23, 2023-24 లేదా 2024-25 విద్యాసంవత్సరాల్లో పాసై ఉండాలి. అలాగే 2025-26 విద్యాసంవత్సరంలో మొదటిసారి ఏదైనా కోర్సులో అడ్మిషన్ తీసుకోవాలి. ఇందులో 10వ తరగతి తర్వాత డిప్లొమా చేస్తున్న అమ్మాయిలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. మెడికల్, ఇంజనీరింగ్, అండర్‌గ్రాడ్యుయేట్ కోర్సులకి ఈ స్కిం వర్తిస్తుంది.

లాంచ్ కి ముందే Samsung Galaxy F17 5G లీకైన స్పెసిఫికేషన్స్, ధరలు!

ఇక ఇందుకోసం దరఖాస్తు ఎలా చేయాలన్న విషయానికి వస్తే.. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లో ఉంటుంది. ముందుగా విద్యార్థులు LIC అధికారిక వెబ్‌సైట్ licindia.in లోకి వెళ్లి అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ఫారమ్‌తో పాటు మార్కుల జాబితా, అడ్మిషన్ ప్రూఫ్, ఆదాయానికి సంబంధించిన సర్టిఫికేట్లు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఈ స్కాలర్షిప్ కు చివరి తేదీ సెప్టెంబర్ 22, 2025.

Exit mobile version