Indian Navy Recruitment 2026: భారత నావికాదళంలో బీటెక్ క్యాడెట్ ఎంట్రీకి దరఖాస్తులు.. అర్హత, ఎంపిక వివరాలు ఇవే
- భారత నావికాదళంలో బీటెక్ క్యాడెట్ ఎంట్రీ
- దరఖాస్తు ప్రక్రియ మే 29, 2026 నుంచి ప్రారంభమైంది
- జూన్ 18, 2026 వరకు తమ దరఖాస్తులను సమర్పించవచ్చు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిరుద్యోగులకు గుడ్ న్యూస్. భారత నావికాదళం జనవరి 2027 బ్యాచ్‌కు సంబంధించిన 10+2 (బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ మే 29, 2026 నుంచి ప్రారంభమైంది. అభ్యర్థులు జూన్ 18, 2026 వరకు తమ దరఖాస్తులను సమర్పించవచ్చు. ఇంజనీరింగ్ విద్యతో పాటు భారత నావికాదళంలో అధికారిగా సేవలందించాలని కోరుకునే విద్యార్థులకు ఇది మంచి అవకాశం. దేశ సేవ చేయడంతో పాటు ఉన్నత స్థాయి శిక్షణ, కెరీర్ వృద్ధి అవకాశాలు కూడా ఈ కోర్సు ద్వారా లభిస్తాయి. నోటిఫికేషన్ వివరాల కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.
ఖాళీల వివరాలు
Also Read
- Aryan Shukla: ఏఐ కంటే స్పీడ్‌గా లెక్కలేసే భారతీయ కుర్రాడు..16 ఏళ్లకే 9 గిన్నిస్ రికార్డులు, అనేక బంగారు పతకాలు..
- AP Intermediate: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ఇంటర్ బోర్డు.. పరీక్షల ఫీజు గడువు పెంపు..
- RRB Jobs : రైల్వేలో 1,265 ఉద్యోగాలు.. దరఖాస్తులకు నేటి నుంచే అవకాశం
- Government Jobs Rules: ప్రభుత్వ ఉద్యోగార్థులకు బిగ్ అలర్ట్.. ఈ చిన్న తప్పులు చేస్తే లైఫ్ లాంగ్ బ్యాన్ కావడం ఖాయం!
అధికారిక నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 60 పోస్టులను భర్తీ చేయనున్నారు.
మెకానికల్ ఇంజనీరింగ్ – 30 పోస్టులు
ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ – 30 పోస్టులు
అర్హతలు
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ క్రింది అర్హతలను కలిగి ఉండాలి:
జనన తేదీ: 02 జూలై 2007 నుంచి 01 జనవరి 2010 మధ్య జన్మించి ఉండాలి.
12వ తరగతిలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ (PCM) సబ్జెక్టుల్లో కనీసం 70 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
10వ లేదా 12వ తరగతిలో ఇంగ్లీష్ సబ్జెక్టులో కనీసం 50 శాతం మార్కులు సాధించి ఉండాలి.
దరఖాస్తు విధానం
అభ్యర్థులు ఈ క్రింది దశలను అనుసరించి దరఖాస్తు చేసుకోవచ్చు:
భారత నావికాదళ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
హోమ్‌పేజీలో ఉన్న Online Application లింక్‌పై క్లిక్ చేయండి.
నమోదు (రిజిస్ట్రేషన్) చేసి లాగిన్ అవ్వండి.
10వ, 12వ తరగతి మార్కుల వివరాలను నమోదు చేయండి.
అవసరమైన పత్రాలను JPG లేదా TIFF ఫార్మాట్లో అప్లోడ్ చేయండి.
దరఖాస్తును సమర్పించి, భవిష్యత్తు అవసరాల కోసం ప్రింటౌట్ తీసుకుని భద్రపరచుకోండి.
ఎంపిక ప్రక్రియ
దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హులైన అభ్యర్థులను SSB ఇంటర్వ్యూకు షార్ట్‌లిస్ట్ చేస్తారు.
ఎంపిక ఈ క్రింది దశల ఆధారంగా జరుగుతుంది:
SSB ఇంటర్వ్యూ
వైద్య పరీక్ష (Medical Examination)
మెరిట్ జాబితా
ఈ అన్ని దశల్లో ప్రతిభ కనబరిచిన అభ్యర్థులకు భారత నావికాదళంలోని బీటెక్ క్యాడెట్ ఎంట్రీలో అవకాశం లభిస్తుంది.
తాజావార్తలు
-
Botsa Satyanarayana : తుఫాన్ నష్టంపై బొత్స డిమాండ్.. చంద్రబాబు సర్కారుపై విమర్శలు!
-
Shreyas Iyer: ఆ ఒక్కడే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు.. మా ఓటమికి కారణం అదే..
-
PM Modi: ‘నా చివరి శ్వాస వరకు ప్రజాసేవలోనే’.. ఖర్గే వ్యాఖ్యలకు మోదీ కౌంటర్..
-
Sara Ali Khan: కేదార్నాథ్ వెళ్తే పాపమా?.. సారా అలీఖాన్‌కు ముస్లిం మతపెద్ద ఫత్వా..
-
Chhatrapati Shivaji: టీ-సిరీస్ – రిషబ్ శెట్టి కాంబో ఫిక్స్.. శివాజీ మహారాజ్ స్టార్ట్ అయ్యేది అప్పుడే!
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!