Indian Army: ఆర్మీలో జాబ్స్ నోటిఫికేషన్.. రూ.56 వేల నుంచి రూ.2.50 లక్షల వరకు జీతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Army: భారతీయ సైన్యం షార్ట్ సర్వీస్ కమిషన్ (టెక్నికల్) కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హత కలిగిన అవివాహిత పురుష, మహిళా ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు ఈ అవకాశానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు 2026 అక్టోబర్‌లో ప్రీ-కమిషనింగ్ ట్రైనింగ్ అకాడమీ (PCTA)లో శిక్షణ ప్రారంభమవుతుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే అభ్యర్థులు ఇంజినీరింగ్ డిగ్రీ కలిగి ఉండాలి. 2026 అక్టోబర్ 1 నాటికి వయస్సు 20 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే 1999 అక్టోబర్ 1 నుంచి 2006 సెప్టెంబర్ 31 మధ్య జన్మించినవారు అర్హులు.
READ MORE: Story Board: రాజకీయ కుటుంబాల్లో గొడవలకు కారణమేంటి..? ఉత్తరాది, దక్షిణాది ఎక్కడైనా ఇదే తీరా..?
Also Read
- TGPSC Recruitment: ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్.. టీజీపీఎస్సీ నుంచి రెండు నోటిఫికేషన్లు విడుదల.!
- BOI Credit Officer Recruitment 2026: 779 పోస్టులకు దరఖాస్తుల ప్రారంభం.. అర్హత, జీతం, ఎంపిక విధానం పూర్తి వివరాలు
- Job Interview Tips: సీఈవోను అడిగిన ఒక్క ప్రశ్నే కొంపముంచిందా..? భారతీయుడి అనుభవం వైరల్
- Colleges Closed: బిగ్‌షాక్.. దేశవ్యాప్తంగా 58 ఇంజనీరింగ్ కళాశాలలు మూసివేత.. తెలంగాణ, ఏపీ నుంచి ఎన్నంటే..
ఎంపికైన వారికి లెఫ్టినెంట్ హోదాలో షార్ట్ సర్వీస్ కమిషన్ మంజూరు చేస్తారు. శిక్షణ కాలంలో లెఫ్టినెంట్‌కు వర్తించే పూర్తి జీతభత్యాలు అందుతాయి. PCTA శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత లెఫ్టినెంట్ ర్యాంక్‌లో షార్ట్ సర్వీస్ కమిషన్ (టెక్నికల్) ఖరారు అవుతుంది. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఒక సంవత్సరం యాంటీ డేట్ సీనియారిటీ కూడా ఇవ్వబడుతుంది. ఆన్‌లైన్ దరఖాస్తులకు గడువు పురుష అభ్యర్థులకు ఫిబ్రవరి 5 కాగా, మహిళా అభ్యర్థులకు ఫిబ్రవరి 4గా నిర్ణయించారు. జీతభత్యాల విషయానికి వస్తే, లెఫ్టినెంట్‌కు నెలకు రూ.56,100 నుంచి ప్రారంభమై హోదా పెరిగే కొద్దీ పెరుగుతాయి. కెప్టెన్, మేజర్, లెఫ్టినెంట్ కల్నల్, కల్నల్, బ్రిగేడియర్, మేజర్ జనరల్ స్థాయిల వరకు జీతాలు వర్తిస్తాయి. అత్యున్నత హోదా అయిన చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌కు నెలకు రూ.2.50 లక్షల స్థిర జీతం ఉంటుంది. దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు [www.joinindianarmy.nic.in](http://www.joinindianarmy.nic.in) వెబ్‌సైట్‌ను సందర్శించాలి. అక్కడ ‘Officer Entry Appln/Login’ ఎంపికపై క్లిక్ చేసి ముందుగా రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. అనంతరం డ్యాష్‌బోర్డ్‌లో ‘Apply Online’ ఎంపికను ఎంచుకోవాలి. షార్ట్ సర్వీస్ కమిషన్ టెక్నికల్ కోర్సు వద్ద ‘Apply’పై క్లిక్ చేసి దరఖాస్తు ఫారమ్‌ను పూర్తిగా నింపి సమర్పించాలి.
READ MORE: Motorola Edge 50 Pro Price Cut: అమెజాన్‌లో సూపర్ డీల్.. మోటరోలా ఎడ్జ్ 50 ప్రోపై 13 వేల తగ్గింపు!
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi Debut: వైభవ్‌కు ఒకటే చెప్పాం.. టీమిండియా కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Adivi Sesh: బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన అడివి శేష్.. అక్టోబర్‌లో కొత్త యాక్షన్ మూవీ షూటింగ్!
-
POK Protests: పీవోకేలో నిరసనల వేళ కాశ్మీర్ కార్డు.. పాక్ ఆర్మీ చీఫ్ తాజా వ్యాఖ్యలు
-
TGPSC Recruitment: ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్.. టీజీపీఎస్సీ నుంచి రెండు నోటిఫికేషన్లు విడుదల.!
-
Queen 2: విడుదలకు ముందే చిక్కుల్లో కంగనా సినిమా.. రూ.250 కోట్ల కేసుతో కొత్త ట్విస్ట్!
ట్రెండింగ్
-
Telangana Drought Alert: వాన జాడే లేదు.. కరువు కోరల్లోకి తెలంగాణ.. రైతుల్లో పెరుగుతున్న ఆందోళన!
-
Sanju Samson: జింబాబ్వే టూర్లో నో ఛాన్స్.. సంజు కెరీర్ అప్పుడే ముగియలేదు.. ముందుంది మరో సూపర్ ఛాన్స్!
-
ICC Team: టీ20 ప్రపంచకప్ అత్యుత్తమ జట్టు.. భారత్ నుంచి ఒక్కరికే చోటు.. ఆ ఒక్కరు మన అమ్మాయే!
-
Chanakya Neeti : చాణక్య హెచ్చరిక.. ఇలాంటి వారిని పెళ్లి చేసుకోకండి.!
-
Gardening Tips : మీ గులాబీ మొక్కలు వాడిపోతున్నాయా? మీరు చేసే ఈ 4 తప్పులే దానికి కారణం!