Government Jobs 2026: టెన్త్ అర్హతతోనే 23,757 పోస్టులు.. పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగం.. పూర్తి వివరాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Government Jobs 2026: పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేయాలని ఎదురుచూస్తున్నవారికి శుభవార్త.. పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీకి సిద్ధమైంది పోస్టల్ డిపార్ట్మెంట్.. గ్రామీణ డాక్ సేవక్ (GDS) షెడ్యూల్-II (జూలై) కింద బ్రాంచ్ పోస్ట్మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్మాస్టర్ (ABPM), తపాలా ఉద్యోగుల మొత్తం 23,757 పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 21లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది..
పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే ఎంపిక
అయితే, ఈ నియామకంలో అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే.. అభ్యర్థులు ఎలాంటి రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూకు హాజరుకావాల్సిన అవసరం లేదు. అభ్యర్థుల 10వ తరగతి మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా రూపొందించి ఎంపిక చేస్తారు. కంప్యూటర్ సిస్టమ్ ద్వారా మార్కులను లెక్కించి మెరిట్ జాబితా తయారు చేస్తారు. మెరిట్ జాబితాలో చోటు దక్కిన అభ్యర్థులను ముందుగా డాక్యుమెంట్ వెరిఫికేషన్, అనంతరం వైద్య పరీక్షకు పిలుస్తారు. ఈ ప్రక్రియ పూర్తైన తర్వాత ఎంపికైన వారికి నియామక పత్రాలు జారీ చేస్తారు.
Also Read
- One Year MA: ఒక్క సంవత్సరంలోనే ఎంఏ పూర్తి.. కొత్త కోర్సు ప్రవేశపెట్టిన ఇగ్నో..
- TET Results Out: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..
- ISRO IPRC Recruitment 2026: ఇస్రోలో ఉద్యోగాలు.. 10వ తరగతి, ITI, డిప్లొమా అర్హతతో అప్లై చేయండి!
- Notification Cancelled: నిరుద్యోగులకు అలర్ట్.. TGPSC నుంచి విడుదలైన ఆ నోటిఫికేషన్ రద్దు..
ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?
గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. పదో తరగతిలో గణితం, ఇంగ్లిష్ సబ్జెక్టులు తప్పనిసరి. అలాగే అభ్యర్థులు దరఖాస్తు చేస్తున్న ప్రాంతానికి సంబంధించిన స్థానిక భాషపై పరిజ్ఞానం కలిగి ఉండాలి. ఇక, అభ్యర్థుల వయస్సు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు పొందే అవకాశం కూడా ఉంటుంది.. దరఖాస్తు చేసుకునే సమయంలో రూ.100 ఫీజు చెల్లించాలి. అయితే మహిళలు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ట్రాన్స్విమెన్ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము నుంచి మినహాయింపు ఉంది.
రాష్ట్రాల వారీగా పోస్టుల వివరాలు
ఈ నియామకంలో పలు రాష్ట్రాలు, ప్రాంతాలకు పోస్టులు కేటాయించారు. అందులో మహారాష్ట్రలో 2,297, తమిళనాడులో 2,118, ఉత్తరప్రదేశ్లో 1,691, పశ్చిమ బెంగాల్లో 1,619, మధ్యప్రదేశ్లో 1,450, జార్ఖండ్లో 1,379, కేరళలో 1,373, ఈశాన్య ప్రాంతంలో 1,354, ఒడిశాలో 1,353, కర్ణాటకలో 1,116, బీహార్లో 1,098 పోస్టులు ఉన్నాయి. అయితే, అర్హత ఉన్న అభ్యర్థులు చివరి తేదీ కోసం వేచి చూడకుండా సెప్టెంబర్ 21లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడం మంచిది. 10వ తరగతి మార్కుల ఆధారంగా ఎంపిక జరగడంతో మంచి మార్కులు సాధించిన అభ్యర్థులకు అవకాశాలు మెరుగ్గా ఉండొచ్చు.
తాజావార్తలు
-
Soori : కమెడియన్ టు బెస్ట్ యాక్టర్.. వందకోట్ల హీరోగా ‘సూరి’
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Diljit Dosanjh: వెంబ్లీ స్టేడియంలో ‘సాన్సోం కి మాలా’.. దిల్జిత్తో 90 వేల మంది ఫ్యాన్స్ మాస్ సెలబ్రేషన్!
-
Government Jobs 2026: టెన్త్ అర్హతతోనే 23,757 పోస్టులు.. పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగం.. పూర్తి వివరాలు..
-
Women’s Asia Cup 2026: ఆసియా కప్లో టీమిండియా జోరు.. ఆ నలుగురే వల్లే ట్రోఫీ!
ట్రెండింగ్
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్గా యువరాజ్ సింగ్!