IBPS Clerk 2025: బ్యాంక్ రంగంలో ఉద్యోగాన్ని సంపాదించాలని కలలుగన్నవారికి అరుదైన అవకాశం వచ్చింది. IBPS (Institute of Banking Personnel Selection) 2025 సంవత్సరానికి సంబంధించిన క్లర్క్ పోస్టుల భర్తీకి మొత్తం 10,277 ఖాళీలకు సంబంధించి కొత్తగా నోటిఫికేషన్ విడుదల చేసింది. మరి ఈ ఉద్యోగాల సెలక్షన్ ప్రాసెస్ సంబంధించి ముఖ్యమైన వివరాలు, అర్హతలు, పరీక్ష తేదీలు, దరఖాస్తు ప్రక్రియ గురించి వివరంగా తెలుసుకుందామా..
ఈ సంవత్సరం IBPS ప్రిలిమినరీ పరీక్షలు 2025 అక్టోబర్ 4, 5, 11 తేదీల్లో జరగనున్నాయి. మెయిన్స్ పరీక్ష నవంబర్ 29న జరగనుంది. నోటిఫికేషన్ జూలై 31, 2025 న విడుదల అయింది. ఈసారి దేశవ్యాప్తంగా 11 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లర్క్ ఉద్యోగాల భర్తీకి మొత్తం 10,277 ఖాళీలు ప్రకటించారు. వాటిలో ఉత్తరప్రదేశ్‌కు అత్యధికంగా 1315 ఖాళీలు ఉండగా, పశ్చిమ బెంగాల్‌కు 540 పోస్టులు కేటాయించబడ్డాయి.
IND vs ENG: భారత్‌ది కూడా ‘బజ్‌బాల్’ ఆటే.. బిత్తరపోయిన ఇంగ్లండ్ ప్లేయర్స్! ఆధిక్యం 166
అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు కనీస వయస్సు 20 సంవత్సరాలు, గరిష్టంగా 28 సంవత్సరాలు ఉండాలి. అంటే అభ్యర్థి 02 జూలై 1997 తర్వాత, 01 జూలై 2005 లోపు జన్మించి ఉండాలి. రిజర్వేషన్ ఉన్న వర్గాల అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. అలాగే, ఒక గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ (గ్రాడ్యుయేషన్) పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థి అప్లికేషన్ ఫిల్ చేసే సమయంలో డిగ్రీ సర్టిఫికేట్ లేదా మార్క్‌షీట్ ఉండాలి. ఈ ఉద్యోగాలకు కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి. అందుకోసం సంబంధిత సబ్జెక్ట్‌ను హైస్కూల్ లేదా డిగ్రీలో చదివి ఉండాలి. అలాలేకుంటే కంప్యూటర్ కోర్సు (సర్టిఫికేట్/డిప్లొమా) పూర్తిచేసి ఉండాలి.
Vijay Deverakonda : ఏంటీ.. అర్జున్ రెడ్డి కోసం విజయ్ ఇంతే తీసుకున్నాడా..
ఇక దరఖాస్తు ఫీజు విషయానికి వస్తే.. SC / ST / PWD అభ్యర్థులకు రూ.175 కాగా, ఇతర వర్గాల వారికి రూ.850గా నిర్ణయించారు. ఎంపిక ప్రక్రియలో మొదటి దశగా ప్రిలిమినరీ పరీక్ష, అనంతరం మెయిన్ పరీక్ష ఉంటుంది. మెయిన్ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. ఈ విధంగా IBPS క్లర్క్ పరీక్ష ద్వారా మీరు భారతదేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉద్యోగాన్ని పొందే అవకాశాన్ని సంపాదించవచ్చు. మరిన్ని వివరాలు కోసం IBPS అధికారిక వెబ్‌సైట్ (https://www.ibps.in) ను సందర్శించండి. ఇంకెందుకు ఆలస్యం అప్లికేషన్ చేసేసుకొని, పరీక్షకు సిద్ధం అవ్వండి.
IBPS Clerk 2025 Notification is now out.
– Vacancies: 10,277
– Last date to apply: 21st August 2025
– Salary: 24,050-64,480
– Qualification: Graduation from any discipline
– Age Limit: 20-28 Years
– Relaxation for categories
– Pattern: Prelims, Mains, Local Language…— Mudit Gupta (@mudit_gupta25) August 2, 2025
