NTV Telugu Site icon

Zelensey: మరోసారి ట్రంప్‌తో భేటీపై జెలెన్‌స్కీ కీలక ప్రకటన

Trump

Trump

వైట్‌హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్-ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మధ్య తీవ్రమైన వాగ్యుద్ధం నడిచింది. రష్యాతో యుద్ధం, అలాగే ఖనిజ ఒప్పందాలపై ఇరువురి మధ్య మాటల యుద్ధం నడిచింది. మధ్యలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కలుగజేసుకున్నా.. జెలెన్‌స్కీ ఏ మత్రం వెనుకడుగు వేయలేదు. మీడియా సమక్షంలోనే ఉక్రెయిన్ అధ్యక్షుడు దూకుడుగా వ్యవహరించారు. ఇందుకు సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక ఎలాంటి సంతకాలు చేయకుండానే సమావేశం మధ్యలోనే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ వెళ్లిపోయారు.

తాజాగా జెలెన్ స్కీ స్పందిస్తూ.. మరోసారి ట్రంప్‌తో భేటీకి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. అమెరికాతో సంబంధాలు కొనసాగించాలని అనుకుంటున్నానని.. దాన్ని ఎలా కాపాడుకోవాలో తనకు తెలుసు అని చెప్పారు. నిర్మాణాత్మక సంభాషణ కోసం డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానిస్తే మరోసారి భేటీకి వెళ్తేందుకు రెడీగా ఉన్నట్లు జెలెన్ స్కీ స్పష్టం చేశారు. సమస్యలను పరిష్కరించుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు జెలెన్ స్కీ వెల్లడించారు.

ఇదిలా ఉంటే జెలెన్ స్కీకి యూరప్ దేశాలు మద్దతుగా నిలిచాయి. మార్చి 2న జరిగిన లండన్ సమ్మిట్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌కు యూరప్ బలమైన మద్దతును అందించాయి. అంతేకుండా తమ సైన్యాలను ఉక్రెయిన్‌కు పంపించేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు ఆ దేశాలు మద్దతుగా నిలిచాయి.