Yevgeny Prigozhin On Russia Ukraine War: దాదాపు ఏడాది కాలం నుంచి రష్యా, ఉక్రెయిన్ మధ్య కొనసాగుతూనే వస్తోంది. కొంతకాలం నుంచైతే ఈ యుద్ధం మరింత ఉధృతం అయ్యింది. ముఖ్యంగా.. రష్యా అయితే ఉక్రెయిన్‌పై భీకర దాడులు చేస్తోంది. ప్రభుత్వ కార్యకలాపాలు, విద్యుత్ సంస్థల్ని టార్గెట్ చేస్తూ.. ఎయిర్‌స్ట్రైక్‌లకి దిగుతోంది. ఈ నేపథ్యంలోనే రష్యాని తిప్పికొట్టేందుకు గాను ఉక్రెయిన్‌కు అమెరికా, జర్మనీ లాంటి దేశాలు అధునాతన ఆయుధాలు అందజేస్తూ వస్తున్నాయి. దీంతో.. పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రైవేట్ మిలటరీ కాంట్రాక్టర్, వాగ్నర్ గ్రూప్ యజమాని యెవ్‌గెనీ ప్రిగోజిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న ఆయన.. ఈ రెండు దేశాల మధ్య యుద్ధం మరికొన్నేళ్లు సాగే అవకాశాలు ఉన్నాయని కుండబద్దలు కొట్టారు.
Bangladesh President: బంగ్లాదేశ్ అధ్యక్షుడిగా షహబుద్దీన్ చుప్పు ఎన్నిక
ఓ వీడియో ఇంటర్వ్యూలో ప్రిగోజిన్ మాట్లాడుతూ.. ‘‘రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఇంకా కొన్నేళ్లు సాగొచ్చు. కీలక పారిశ్రామిక ప్రాంతమైన డోన్‌బాస్‌పై పూర్తిస్థాయి ఆధిపత్యం సాధించేందుకు ఏడాదిన్నర నుంచి రెండేళ్ల వరకు సమయం పట్టొచ్చు. అలాగే.. నీపర్ నదికి తూర్పు వైపునున్న విస్తార ప్రాంతంపై పట్టు సాధించడానికి మూడేళ్లు పట్టొచ్చు. కంచుకోటలాంటి డొనెట్‌స్క్‌లోని బఖ్ముత్‌లో తమ గ్రూప్ శ్రేణులు, ఉక్రెయిన్ దళాలతో భీకర పోరాటం సాగిస్తున్నాయి’’ అంటూ చెప్పుకొచ్చారు. కాగా.. ప్రిగోజిన్‌కి చెందిన ప్రైవేట్ సైన్యం.. రష్యా మిలటరీతో కలిసి ఉక్రెయిన్‌లో యుద్ధం చేస్తోంది. ఇతనికి ‘పుతిన్ వంట మనిషి’గా కూడా పేరుంది. ఎందుకంటే.. రష్యా అధ్యక్ష భవనమైన క్రెమ్లిన్ కేటరింగ్ కాంట్రాక్టులు ప్రిగోజిన్ చేస్తాడు. అటు.. రష్యా సైతం తమ ‘స్పెషల్ మిలటరీ ఆపరేషన్’ అనుకున్న లక్ష్యాలను సాధించేవరకు ఈ యుద్ధం కొనసాగుతూనే ఉంటుందని చెప్తూ వస్తున్న సంగతి తెలిసిందే!
Frozen Lake Marathon: భారత్‌లో తొలి ఫ్రోజెన్ లేక్ మారథాన్.. గడ్డకట్టిన సరస్సుపై పరుగులు