NTV Telugu Site icon

Xi Jinping: ముచ్చటగా మూడోసారి.. చైనా అధ్యక్షుడిగా జిన్‌పింగ్ ప్రమాణస్వీకారం

Xi Jinping

Xi Jinping

Xi Jinping Begins Historic Third Term As China President: చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌ ముచ్చటగా మూడోసారి ఆ దేశ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశారు. దీంతో జిన్‌పింగ్ మరో ఐదేళ్లపాటు డ్రాగన్ కంట్రీకి అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. గతేడాది అక్టోబర్ 16వ తేదీన జరిగిన 20వ కమ్యూనిస్ట్‌ పార్టీ కాంగ్రెస్‌లో జిన్‌పిన్‌ను మరోసారి అధ్యక్షుడిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. కమ్యూనిస్ట్‌ పార్టీ చీఫ్‌గా, చైనా అధ్యక్షుడిగా జిన్‌పిన్ తన పదేళ్ల పదవి కాలాన్ని నేటితో పూర్తి చేసుకున్నారు. శుక్రవారం ప్రతినిధులు ఆయనకు మూడోసారి చైనా అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించారు. అలాగే.. చైనా సెంట్రల్ మిలిటరీ కమిషన్‌కు అధిపతిగా ఏకగ్రీవంగా తిరిగి ఎన్నికయ్యారు. ఆయనకు అనుకూలంగా మొత్తం 2,952 ఓట్లు వచ్చాయి.

Pavithra Naresh: ఔను.. వాళ్లిద్దరు పెళ్లి చేసుకున్నారు

మూడోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తూ.. ‘‘పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా రాజ్యాంగానికి విధేయుడిగా ఉంటానని, రాజ్యాంగం అధికారాన్ని సమర్థిస్తానని, నా చట్టబద్ధమైన బాధ్యతలను నిర్వర్తిస్తానని, మాతృభూమికి విధేయుడిగా ఉంటానని, ప్రజలకు విధేయుడిగా ఉంటానని ప్రమాణం చేస్తున్నాను’’ అంటూ జిన్‌పిన్ వాగ్ధానం చేశారు. తన విధులను నిజాయితీగా, కష్టపడి నెరవేరుస్తానని చెప్పిన ఆయన.. సంపన్నమైన, బలమైన, ప్రజాస్వామ్య, నాగరిక, సామరస్యపూర్వకమైన గొప్ప ఆధునిక సోషలిస్టు దేశాన్ని నిర్మిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ‘‘ది మోస్ట్‌ పవర్‌ఫుల్‌ మ్యాన్‌ ఇన్‌ ది వరల్డ్‌’’ అనే శీర్షికతో జిన్‌పింగ్‌ బయోగ్రఫీని రాస్తున్న రచయిత గీజేసి మాట్లాడుతూ.. జిన్‌పింగ్ దృష్టి కేవలం చైనా పేనే ఉందని, తన దేశాన్ని ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశంగా చూడాలని జిన్‌పింగ్ అనుకుంటున్నాడని తెలిపాడు.

Indonesia Capital: ఇండోనేషియా రాజధాని మార్పు..?

కాగా.. చైనా కమ్యూనిస్ట్ పార్టీ వ్యవస్థాపకుడు మావో జెడాంగ్ తర్వాత జిన్‌పింగ్ చైనా అధ్యక్షుడిగా మూడోసారి పగ్గాలు పట్టాడు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ గానీ, పేరు ప్రఖ్యాతలు లేకుండా ఈ పార్టీలో అడుగుపెట్టిన జిన్‌పింగ్.. ఇప్పుడు ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన నాయకుల్లో ఒకడిగా ఎదిగారు. నిజానికి.. పార్టీ నిబంధనల ప్రకారం ఏ ఒక్కరు కూడా పదేళ్లకు మించి అధికారంలో ఉండకూడదు. కానీ.. జిన్‌పింగ్ కోసం ఆ నిబంధనని కమ్యూనిస్టు పార్టీ పక్కన పెట్టేసింది. జిన్‌పింగ్‌ సన్నిహితుడు లీ కియాంగ్‌ను కొత్త ప్రీమియర్‌గా(ప్రధానిగా) నియమించేందుకు రంగం కూడా సిద్దం అయ్యింది.

Show comments