WWE – Sara Lee: మాజీ రెజ్లర్ సారా లీ హఠాన్మరణం.. కారణం చెప్పని తల్లి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
WWE Former Wrestler Sara Lee Died At 30: వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్(డబ్ల్యూడబ్ల్యూఈ) రంగంలో విషాదం చోటు చేసుకుంది. తన ప్రదర్శనతో రెజ్లింగ్ అభిమానుల్ని అలరించిన మాజీ రెజ్లర్ సారా లీ కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆమె తల్లి టెర్రీ లీ ధృవీకరించారు. తమ కుమార్తె ఈ లోకాన్ని విడిచి శాశ్వతంగా వెళ్లిపోయిందంటూ.. ఉద్వేగపూరిత నోట్‌ను షేర్ చేశారు. ఈ విషాద సమయంలో తమకు ప్రైవసీ ఇవ్వాలని విజ్ఞప్తి చేసిన ఆమె.. సారా లీ మరణానికి గల కారణాలేంటో వెల్లడించలేదు. ఆమె వయసు కేవలం 30 సంవత్సరాలే!
కాగా.. సారా లీ మృతి పట్ల డబ్ల్యూడబ్ల్యూఈ రంగం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మహిళా క్రీడాలోకంలో సారా లీ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిందని, ఇప్పుడు ఆమె లేరనే వార్త తీవ్రంగా కలచివేస్తోందని పేర్కొంది. ఈ సందర్భంగా ఆమె కుటుంబం, స్నేహితులు, అభిమానులకు సంతాపం తెలిపింది. ఇదే సమయంలో.. సారాతో కలిసి జర్నీ చేసిన మహిళా రెజ్లర్లు ఆమెతో ఉన్న తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ.. తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. సారా మరణవార్త విని హృదయం ముక్కలైందని, ఈ విషాదాన్ని ఎలా తట్టుకోవాలో అర్థం కావడం లేదంటూ సరాయా, చెల్సీ గ్రీన్ ట్వీట్ చేశారు. అలాగే.. ఆమెతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేశారు.
Also Read
ఇదిలావుండగా.. 2015లో డబ్ల్యూడబ్ల్యూఈ రియాలిటీ కాంపిటీషన్‌లో సారా లీ ‘టఫ్ ఎనఫ్’ సిరీస్ విజేతగా నిలిచింది. ఇంకా మరెన్నో విజయాల్ని నమోదు చేసిన ఈమె.. తన సహచర రెజ్లర్ వెస్టిన్ బ్లేక్‌ను పెళ్లాడిందని, అతనితో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిందని సమాచారం.
తాజావార్తలు
-
AP Government Jobs: గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. ఉద్యోగాల వయోపరిమితి పెంపు.. ఎప్పటి వరకు అంటే?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Vishwambhara : రూట్ క్లియర్.. విశ్వంభర వచ్చేస్తోంది
-
Telangana Congress New In-Charge: తెలంగాణ కాంగ్రెస్ కి కొత్త ఇంచార్జ్.?
-
iOS 27 Update: iOS 27 అప్డేట్ విడుదల.. ఏ iPhone మోడళ్లకు లభిస్తుంది? డౌన్లోడ్ చేసుకోవడం ఎలా?
ట్రెండింగ్
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!