Viral News: ఆ మర్డర్ స్టోరీని రియల్ చేసిన రచయిత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆమె ఒక రచయిత్రి.. ముఖ్యంగా క్రైమ్ త్రిల్లర్ కథల్ని రాస్తుంటుంది.. ఈ క్రమంలోనే ఆమె 2011లో ‘హౌ టు మర్డర్ యువర్ హస్బెండ్’ (నీ భర్తను ఎలా చంపాలి) అనే ఓ బ్లాగు రాసింది. కట్ చేస్తే.. 2018లో తాను రాసిన ఆ కథను నిజం చేసింది. తన భర్తను అత్యంత దారుణంగా కాల్చి చంపింది. ఈ ఘటన అమెరికాలోని ఓరెగాన్‌లో చోటు చేసుకుంది. ఈ కేసులో ఆమెను ఓరెగాన్ జడ్జి జీవిత ఖైదు శిక్ష విధించారు. ఆ వివరాల్లోకి వెళ్తే..
ఆ రచయిత్రి పేరు నాన్సీ క్రాంప్టన్ బ్రోఫీ (71). ఈమె భర్త పేరు డేనియల్ బ్రోఫీ. ఈయన పాకశాస్త్ర నిపుణుడిగా ఓ పాఠశాలలో విద్యార్థులకు బోధించేవాడు. ఈ బ్రోఫీ జంట భారీగా అప్పులు చేసింది. వాటినెలా తీర్చాలో తెలీక, చాలాకాలం నుంచి తర్జనభర్జన పడుతోంది. ఈ క్రమంలోనే భర్త పేరిట 1.5 మిలియన్ డాలర్ల బీమ ఉందన్న విషయం గ్రహించి, ఆ సొమ్ము కోసం భర్తని అంతమొందించాలని ప్లాన్ వేసింది. అందుకు సరైన సమయం కోసం కాపుకాచింది.
Also Read
- Trump-Jinping: ఇరాన్‌కు సాయపడడం భావ్యం కాదు.. జిన్‌పింగ్‌కు ట్రంప్ హితవు
- Bill Gates: ఏఐతో బిలియన్ మంది ప్రాణాలు పోయే ప్రమాదం! బిల్ గేట్స్ తీవ్ర హెచ్చరిక
- Houthi War: సౌదీకి పాకిస్తాన్ దూరం.. అండగా నిలుస్తున్న ఫ్రాన్స్!
- Trump-Jinping: జిన్‌పింగ్ టూర్ ఎఫెక్ట్.. రష్యా ఆంక్షల బిల్లు నుంచి చైనాకు మినహాయింపు!
ఎట్టకేలకు ఆ రోజు రానే వచ్చేసింది. 2018 జూన్ నెలలో భర్త ఉద్యోగానికి వెళ్లగా, అతడ్ని నాన్సీ ఫాలో అయ్యింది. పని ప్రదేశంలోని నీటి సింక్ వద్ద డేనియల్ ఉండగా, ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవడాన్ని గమనించి నాన్సీ వెనుక నుంచి తన గ్లోక్ హ్యాండ్ గన్‌తో కాల్చి చంపింది. అతడు గాయపడి కింద పడిపోగా, దగ్గర నుంచి మరోసారి గుండెల్లో కాల్చింది. దీంతో, అతడు అక్కడికక్కడే మరణించాడు.
కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా.. భార్య నాన్సీనే బీమా డబ్బుల కోసం భర్తను కాల్చి చంపినట్టు తేలింది. నిందితురాలు రహస్యంగా లైసెన్స్ లేని మరో తుపాకీ కిట్‌ను కూడా కొనుగోలు చేసినట్లు ప్రాసిక్యూషన్ తేల్చింది. కానీ, ఈ ఆరోపణల్ని నాన్సీ తోసిపుచ్చింది. సరికొత్త పుస్తకం కోసం పరిశోధనలో భాగంగా ఆ గన్ కొనుగోలు చేసినట్లు తెలిపింది. ఏదేమైనా.. ఈ కేసులో దోషిగా తేలడంతో కోర్టు ఆమెకు జీవిత ఖైదు విధించింది. కాగా.. నాన్సీ ‘ది రాంగ్ హస్బెండ్’, ‘ది రాంగ్ లవర్’ పేరిట నవలల్ని కూడా రాసింది. కానీ, వాటికి అంత ఆదరణ దక్కలేదు.
తాజావార్తలు
-
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
-
OTR: టీడీపీ-వైసీపీ ‘జెంటిల్మెన్ అగ్రిమెంట్’?రామేశ్వరం మెట్టపై హాట్ డిస్కషన్..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!