Site icon NTV Telugu

World Richest Families: ప్రపంచ ధనికుల కుటుంబం లిస్ట్ విడుదల.. అంబానీకి ఎన్నో ర్యాంక్ అంటే..!

World Richest Families

World Richest Families

ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ధనికుల కుటుంబాల జాబితా విడుదలైంది. ప్రపంచంలోని 25 సంపన్న కుటుంబాల జాబితాను బ్లూమ్‌బెర్గ్ విడుదల చేసింది. ఈ జాబితాలో భారతదేశం నుంచి అంబానీ కుటుంబానికి చోటు దక్కింది. 25 సంపన్న కుటుంబాల్లో అంబానీ ఫ్యామిలీ 8వ స్థానంలో నిలిచింది. అంబానీ కుటుంబం అపారమైన సంపద, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రత్యేక స్థానం ఉందంటూ పేర్కొంది.

బ్లూమ్‌బెర్గ్ ప్రకారం.. అంబానీ కుటుంబం సంపద 105.6 బిలియన్లుగా ఉన్నట్లుగా తెలిపింది. ఇది ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన వ్యాపార రాజవంశాల్లో ఒకరిగా వెల్లడించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, శక్తి, పెట్రోకెమికల్స్, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో పనిచేస్తుందని తెలిపింది. అదే సమయంలో డిజిటల్ సేవలు, స్థిరత్వం-ఆధారిత వెంచర్లలోకి కూడా విస్తరిస్తుందని పేర్కొంది.

అగ్ర స్థానం..
అమెరికాలో రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ యజమానులైన వాల్టన్ కుటుంబంగా పేర్కొంది. 513.4 బిలియన్ల నికర విలువతో జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. మొదటిసారిగా అర ట్రిలియన్ డాలర్ల పరిమితిని అధిగమించింది. వాల్‌మార్ట్ ఇటీవలి ఆర్థిక సంవత్సరంలో 681 బిలియన్ల ఆదాయాన్ని ఆర్జించింది. ప్రపంచవ్యాప్తంగా స్టోర్‌లు విస్తరిస్తున్నాయి.

ఈ ప్రత్యేక ర్యాంకింగ్‌లోకి ప్రవేశించడానికి కనీసం 46.4 బిలియన్ల నికర విలువ ఉండాలి. అలా ఉన్నవాళ్లనే సంపన్న కుటుంబాల జాబితాలో చేర్చుతారు. 2025 జాబితాలో నాలుగు ఖండాలకు చెందిన నాలుగు కొత్త కుటుంబాలు ఉన్నాయి. మెక్సికోకు చెందిన లారియా మోటా వెలాస్కో కుటుంబం. ఇటలీకి చెందిన డెల్ వెచియో కుటుంబం. సౌదీ అరేబియాకు చెందిన ఒలాయన్ కుటుంబాలు ఉన్నాయి.

జాబితాలో ఇతర కుటుంబాలు..
అల్ నహ్యాన్ కుటుంబం: అబుదాబి పాలక రాజవంశం. నికర విలువ 335.9 బిలియన్లుగా ఉన్నట్లు అంచనా. షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ నాయకత్వంలో సంపదను విస్తరిస్తోంది. పెట్రోలియం నిల్వల్లో ఎక్కువ భాగాన్ని సంపాదిస్తుంది.

అల్ సౌద్ కుటుంబం: సౌదీ అరేబియా రాజకుటుంబం. నికర విలువ 213.6 బిలియన్ల అంచనా. చమురు నిల్వల ద్వారానే సంపాదన. కుటుంబంలో సుమారు 15,000 మంది సభ్యులు ఉన్నప్పటికీ.. సంపద కేంద్రీకరణ సీనియర్ రాజకుటుంబంలో ముఖ్యంగా క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్‌ ఆధ్వర్యంలో ఉంది.

అల్ థాని కుటుంబం: ఖతార్ పాలక కుటుంబం. నికర విలువ 199.5 బిలియన్లుగా అంచనా. 1940లో చమురు కనుగొన్న తర్వాత సంపద పెరిగింది. తాత్కాలిక ఎయిర్ ఫోర్స్ వన్‌గా ఉపయోగించుకునేందుకు అల్ థాని కుటుంబం ఇటీవల ట్రంప్‌కు విలాసవంతమైన బోయింగ్ 747ను బహుకరించింది.

హెర్మేస్ కుటుంబం: ఆరు తరాలుగా హెర్మేస్ కుటుంబం ఆదాయం 184.5 బిలియన్ల అంచనా. ఈ బ్రాండ్ అల్ట్రా-లగ్జరీ వస్తువులకు.. ముఖ్యంగా బిర్కిన్ హ్యాండ్‌బ్యాగ్‌కు ప్రసిద్ధి చెందింది. ప్రపంచంలోని అతిపెద్ద లగ్జరీ గృహాలలో ఒకటిగా ర్యాంక్ పొందింది.

Exit mobile version