International Photography Day: చెదరని జ్ఞాపకం, మధుర స్మృతులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మనిషి జీవిన శైలిలో ప్రతీరోజు ఓ మధుర జ్ఞాపకం. 24గంటల్లో మన జీవితంలో సరదాలు, సంతోషాలు, వీటిలో కొన్ని అప్పటికప్పుడు మరచిపోయేవి, మరికొన్ని జీవితాంతం భద్రంగా దాచుకోవాల్సినవి. ఈకరిగేకాలంలో చెదిరిపోని స్మృతులకు ప్రతిబింబాలు ఫోటోలు. ఈ కరిగేకాలంలో చెదిరిపోని స్మృతులకు ప్రతిబింబాలే మన ఫోటోలు. అనాటి మధుర జ్ఞాపకాలను మళ్లీ మళ్లీ తనివితీరా వీక్షించేందుకు అవకాశాలన్ని ఇచ్చే తీపిగుర్తులు ఫోటోలు. మనం మాట్లాడే మాటలు, పదాలు కొన్నాళ్లకు మరచిపోతాం. కానీ.. ఓఫోటోను చూస్తే ఎంతోకాలం మదిలో ముద్రవేసుకుపోతుంటాయి. ఆఫోటో చూస్తూ ఒక్క క్షణం పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటాం.
అటువంటి ప్రాముఖ్యత కలిగిన ఫోటోగ్రఫీకి కూడా ఓరోజు వుందన్న సంగతి మనలో కొద్ది మందికే తెలుసుకు అది ఆగస్టు 19. ఫ్రాన్స్‌కు చెందిన లూయిస్ జే.ఎం డాగ్యూరే 1837లో ఫోటోగ్రఫీ పద్ధతిని కొనుగొన్నారు. అంతకు ముందు 1826లోనే ఫ్రాన్స్‌కే చెందిన జోసెఫ్ నైసిఫోరా నీప్సి ఫోటోగ్రఫీ చరిత్రలో తొలిసారిగా ఛాయాచిత్రాన్ని తయారు చేశారట. తన ఇంటి వెనుక పెరట్లో 8 గంటలపాటు ఛాయాచిత్రాన్ని సిల్వర్ అణువులు వున్న ప్లేట్ పై ఆయన ఈచాయాచిత్రాన్ని బంధించారట. కానీ, దానిని ఎక్కువ రోజులు కాపాడలేకపోవడంతో, డాగ్యూరే రూపొందించిన విధానానికి ఫ్రెంచ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఆమోదముద్ర వేసింది. అయితే.. రసాయనాలతో రూపొందించిన ప్లేటుపై కాంతిచర్యతో ఓ రూపాన్ని బంధించడమే ఫోటోగ్రఫీ అని, ఈ పదం గ్రీకు భాష నుంచి వచ్చింది.
Also Read
- China: కొత్త గేమ్‌కి రెడీ అవుతున్న చైనా.. ప్రపంచానికి షాక్ తప్పదా?
- Israel-Iran: పర్వతం కింద అణు పదార్థం.. ఇరాన్‌పై ఇజ్రాయిల్ సంచలన రిపోర్ట్..
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై భారత్ కీలక నిర్ణయం.. పాక్‌కు స్పష్టమైన సందేశం..
- Crude Oil Prices: మరో షాక్.. హార్మూజ్ తర్వాత కొత్త సంక్షోభం.. ముడి చమురు ధరలు భారీగా పెరుగుతాయా..?
ఫోటోగ్రఫీ అంటే..
ఫోటో అంటే చిత్రం..
గ్రఫీ అంటే గీయడమని అర్థం అన్నమాట.
ఆగస్టు 19న 1839లో ఫ్రాన్స్ ప్రభుత్వం ఫోటోగ్రఫీపై పేటెంట్ హక్కులు కొనుగోలు చేసి, దానిని ప్రపంచానికి ఉచితంగా అందించింది. అందుకే ప్రతి ఏటా ఆగస్టు 19న అంతర్జాతీయ ఫోటోగ్రఫీ దినోత్సవంగా జరుపుకుంటున్నారు. అయితే.. మనదేశంలో కేవలం బ్రిటీష్ ఉన్నతాధికారులు, జమీందార్లు, సైనికులు మాత్రమే ఫోటోగ్రీఫీని ఉపయోగించేవారు. దీనిని 1877 నుంచి సామాన్యులకు అందుబాటులోకి తెచ్చారట. మొదట ఫోటోగ్రఫీ కెమెరాలు చాలా పెద్దగా ఉండేవి. కాలక్రమంలో ఎయిమ్ అండ్ షూట్ కెమెరాలు, ఫీల్డ్ కెమెరాలు, డోనల్ కెమెరాలు, డిజిటల్ సింగిల్ లేన్స్ రిఫ్లెక్ట్, ఫ్లై కెమెరాలు అందుబాటులోకి వచ్చాయి. కాగా.. ఒకప్పుడు రీల్స్‌తో ఫోటోలు తీసే స్థాయి నుంచి ఇప్పుడు చిన్న మెమోరీ కార్డుతో వందలాది ఫోటోలు తీసే స్థాయికి ఫోటోగ్రఫీ చేరుకుంది. అయితే ఇంతటి పరిజ్ఙానం వెనుక ఎందరో శాస్త్రవేత్తల అధ్యయనాలు, పరిశోధనాలు నిరంతర కృషి దాగివుంది. అంతటి మహనీయులను ఒక్కసారి గుర్తు చేసుకోవడయే ఈఅంతర్జాతీయ ఫోటోగ్రఫీ దినోత్సవం ముఖ్య ఉద్దేశం.
Vijayvargiya: ‘నితీష్.. బాయ్‌ఫ్రెండ్స్‌ని మార్చుకునే విదేశీ మహిళల లాంటి వాడు’
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్‌కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్‌కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్‌ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్‌తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!