NTV Telugu Site icon

US Flight: విమానంలో మహిళ వికృత చర్యలు.. బట్టలు విప్పి పరుగులు

Usflight

Usflight

విమాన ప్రయాణమంటే ఎంతో ఖరీదు పెట్టి టికెట్ కొని ప్రయాణం చేస్తుంటారు. ఎవరైనా త్వరగా గమ్యం చేరుకోవాలని తాపత్రయం పడుతుంటారు. ఇంకా ఆహ్లాదకరంగా ప్రయాణం సాగిపోవాలని కోరుకుంటారు. అలాంటిది ఈ మధ్య విమానాల్లో వింత వింత సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఆ మధ్య విమానంలోనే ఓ జంట శృంగారంలో పాల్గొన్న సంఘటనలు చూశాం. అలాగే ఓ వ్యక్తి ఏకంగా మహిళా ప్రయాణికురాలిపై మూత్రం పోసిన సంఘటనలు చూశాం. తాజాగా ఓ మహిళా ప్రయాణికురాలైతే.. ఏకంగా బట్టలు విప్పేసి నానా హంగామా సృష్టించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి: Telangana Heatwave Alert: వామ్మో ఇవేం ఎండలు రా బాబోయ్.. తెలంగాణలో భానుడి ప్రతాపం

సోమవారం టెక్సాస్‌లోని హ్యూస్టన్‌లోని విలియం పి. హాబీ విమానాశ్రయం నుంచి బయలుదేరిన సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ విమానం ఫీనిక్స్, అరిజోనాకు వెళుతోంది. విమానం టేకాప్ అయి నింగిలోకి వెళ్లింది. అంతే ఓ మహిళా ప్రయాణికురాలు ఉన్నట్టుండి.. మొత్తం బట్టలు విప్పేసి.. పెద్ద పెద్దగా అరుస్తూ.. కేకలు వేస్తూ నానా హంగామా సృష్టించింది. దీంతో సిబ్బందితో పాటు తోటి ప్రయాణికులంతా హడలెత్తిపోయారు. కాక్‌పిట్‌లోకి వెళ్లి సిబ్బందిని దుర్భాషలాడింది. గుండెలపై బాదుకుంటూ కేకలు వేసింది. దాదాపు 25 నిమిషాల పాటు బట్టలు లేకుండానే కలియతిరిగింది. ఈ పరిణామంతో షాకైన సిబ్బంది.. వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించి ల్యాండింగ్ చేశాడు. ఇంతలో ఒకరు ఆమె దేహంపై దుప్పటి కప్పాడు. ఇక ఆమె విమానం దిగగానే పరుగెత్తుకుని వెళ్లిపోతుండగా సిబ్బంది పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అయితే ఆమె మానసిక క్షోభతో బాధపడుతున్నట్లుగా గుర్తించారు. ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతానికి ఆమెపై ఎలాంటి కేసు నమోదు చేయలేనట్లుగా తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: Telangana Heatwave Alert: వామ్మో ఇవేం ఎండలు రా బాబోయ్.. తెలంగాణలో భానుడి ప్రతాపం