Abdul Rehman Makki: ఉగ్రవాదిని చైనా, పాకిస్థాన్ ఎందుకు కాపాడుతున్నాయి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తొయిబా ఉగ్రసంస్థ డిప్యూటీ చీఫ్ అబ్దుల్ రెహ్మాన్ మక్కీని ‘అంతర్జాతీయ ఉగ్రవాది’గా గుర్తించే ప్రతిపాదనకు చైనా చివర్లో అడ్డుపడింది. ఐరాస భద్రతామండలిలో భారత్, అమెరికాలు ఈ మేరకు చేసిన సంయుక్త ప్రతిపాదనను తాజాగా ‘టెక్నికల్ హోల్డ్’లో పెట్టింది. మక్కీని యూఎన్‌ఎస్‌సీలోని ఐఎస్‌ఐఎల్, అల్ ఖైదా ఆంక్షల కమిటీ కింద ‘గ్లోబల్ టెర్రరిస్ట్’గా జాబితాలో చేర్చాలని జూన్ 1న భారత్, అమెరికాలు సంయుక్తంగా ప్రతిపాదించాయి. ఈ ప్రతిపాదనను ‘నో ఆబ్జక్షన్ విధానం’ కింద కమిటీలోని 15 సభ్యదేశాలకు పంపారు. జూన్ 16 వరకు గడువు ఇచ్చారు. ఈ క్రమంలోనే చివర్లో చైనా ఈ ప్రతిపాదనను టెక్నికల్ హోల్డ్‌లో ఉంచింది. భద్రతా మండలి విధి విధానాల ప్రకారం.. దీన్ని ఆరు నెలల వరకు కొనసాగించవచ్చు. తెలిసిన ఉగ్రవాదుల జాబితాకు చైనా అడ్డంకులు పెట్టడం ఇదే మొదటిసారి కాదు. గతంలో, పాకిస్తాన్ ఆధారిత, యూఎన్ నిషేధించిన ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మొహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్‌ను నియమించాలనే ప్రతిపాదనలను అది పదేపదే అడ్డుకుంది.
గతంలోనూ జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్‌ను ఈ జాబితాలో చేర్చేందుకు భారత్ ప్రతిపాదించగా.. చైనా ఇదే విధంగా కనీసం నాలుగు సార్లు అడ్డుకుంది. అజర్ కార్యకలాపాలపై మరింత సమాచారం అవసరమైనందున ఆ మేరకు స్పందించినట్లు వాదించింది. చివరకు, అంతర్జాతీయ సమాజం ఒత్తిడితో 2019లో వెనక్కు తగ్గింది. ఇదిలా ఉండగా.. ఎల్‌ఈటీ వ్యవస్థాపకుడు, 26/11 ముంబయి దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ సమీప బంధువు అయిన మక్కీ.. లష్కరే తొయిబా, జమాద్ ఉద్‌దవాలో నాయకత్వ పదవులు కలిగి ఉన్నాడు. భారత్‌లో.. ముఖ్యంగా జమ్ముకశ్మీర్‌లో ఉగ్ర దాడులకు ప్రణాళికలు రూపొందించడం, నిధుల సేకరణ, యువతను ప్రేరేపించడం వంటివాటి వెనుక అతని హస్తం ఉంది. దేశీయ చట్టాల ప్రకారం భారత్, అమెరికాలు.. ఇప్పటికే మక్కీని ఉగ్రవాదిగా గుర్తించాయి.
Also Read
- Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
- Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
తాజావార్తలు
-
Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం.!
-
Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!