White House: లాక్‌డౌన్‌లో వైట్ హౌస్.. అమెరికా అధ్యక్షుడి నివాసం వద్ద గన్ ఫైర్.. రంగంలోకి సీక్రెట్ సర్వీస్!
White House: అమెరికా అధ్యక్ష భవనం ‘వైట్ హౌస్’ సమీపంలో సోమవారం సాయంత్రం కాల్పులు జరగడం తీవ్ర కలకలం సృష్టించింది. 15వ వీధి – ఇండిపెండెన్స్ అవెన్యూ కూడలిలో, వాషింగ్టన్ మాన్యుమెంట్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వెంటనే అప్రమత్తమైన యూఎస్ సీక్రెట్ సర్వీస్ దళాలు వైట్ హౌస్ సముదాయాన్ని దిగ్బంధించాయి. అసలు ఏం జరిగిందంటే.. సీక్రెట్ సర్వీస్ కథనం ప్రకారం.. సోమవారం సాయంత్రం 4:10 గంటల సమయంలో సాయుధ వ్యక్తి ఒకరు అనుమానాస్పదంగా సంచరిస్తుండటంతో భద్రతా దళాలు అతడిని అడ్డుకున్నాయి. ఈ క్రమంలో జరిగిన కాల్పుల్లో సదరు వ్యక్తి గాయపడ్డాడు. నిందితుడిని ఆసుపత్రికి తరలించగా, అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో వైట్ హౌస్ సిబ్బందికి గానీ, ఇతరులకు గానీ ఎటువంటి గాయాలు కాలేదు.
బ్రీఫింగ్ రూమ్‌లోకి జర్నలిస్టుల తరలింపు..
కాల్పుల శబ్దం వినబడగానే వైట్ హౌస్ అంతటా ‘హై అలర్ట్’ ప్రకటించారు. ఆ సమయంలో నార్త్ లాన్‌లో ఉన్న జర్నలిస్టులను సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు వేగంగా లోపలికి తరలించి, ప్రెస్ బ్రీఫింగ్ రూమ్‌లో ఉంచారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సుమారు 15 నిమిషాల పాటు వైట్ హౌస్ లాక్‌డౌన్‌లో ఉంది. భద్రతా బలగాలు పరిస్థితిని అదుపులోకి తెచ్చిన తర్వాత లాక్‌డౌన్‌ను ఎత్తివేశారు. అనంతరం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ ఈస్ట్ రూమ్‌లో ఏర్పాటు చేసిన చిన్న వ్యాపార యజమానుల సమావేశంలో పాల్గొన్నారు. భద్రతా కారణాల దృష్ట్యా ఈ కార్యక్రమం 45 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. “నేషనల్ గార్డ్‌ను మోహరించడం వంటి కఠిన చర్యల వల్ల వాషింగ్టన్ ఇప్పుడు అమెరికాలోనే అత్యంత సురక్షితమైన నగరంగా మారింది” అని ధీమా వ్యక్తం చేశారు.
Also Read
- West Asia Crisis: పశ్చిమ ఆసియాలో మళ్లీ యుద్ధ జ్వాలలు.. 'ఇరాన్‌ను భూమ్మీద లేకుండా తుడిచిపెట్టేస్తాం'.. ట్రంప్
- Iran Peace Proposal: ఇరాన్ 14-సూత్రాల ప్రతిపాదన.. అమెరికాకు 30 రోజుల అల్టిమేటం
- Operation Hormuz: హార్ముజ్ జలసంధిలో భారీ ఆపరేషన్ చేపట్టిన అమెరికా..
- Donald Trump: ట్రంప్ 'ప్రాజెక్ట్ ఫ్రీడమ్' ప్రకటన.. హార్మూజ్‌లో చిక్కుకున్న ఓడలను సురక్షితంగా బయటకు..
కొనసాగుతున్న హై అలర్ట్
గత ఏప్రిల్ 24న వైట్ హౌస్ కరస్పాండెంట్స్ విందులో కోల్ అలెన్ అనే వ్యక్తి ట్రంప్‌ను హత్య చేసేందుకు ప్రయత్నించిన ఘటన తర్వాత వాషింగ్టన్‌లో భద్రతను పతాక స్థాయికి పెంచారు. తాజా కాల్పుల నేపథ్యంలో ఇండిపెండెన్స్ అవెన్యూ వైపు వెళ్లే రహదారులను మూసివేశారు. మెట్రోపాలిటన్ పోలీసులు, సీక్రెట్ సర్వీస్ సంయుక్తంగా ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు. వాషింగ్టన్ మౌన్యుమెంట్, వైట్ హౌస్ సందర్శనార్థం వచ్చే పర్యాటకులు ఆ ప్రాంతానికి దూరంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
తాజావార్తలు
-
White House: లాక్‌డౌన్‌లో వైట్ హౌస్.. అమెరికా అధ్యక్షుడి నివాసం వద్ద గన్ ఫైర్.. రంగంలోకి సీక్రెట్ సర్వీస్!
-
Prabhas Fauj : ప్రభాస్ ఫౌజీ మూవీ షూటింగ్ కు వెళ్తున్న ప్రొడక్షన్ వాహనం కు యాక్సిడెంట్
-
West Bengal: బీజేపీ విజయం తర్వాత తెరుచుకున్న దుర్గా ఆలయం.. భక్తుల్లో ఆనందోత్సాహం
-
TVK : టీవీకే విజయకేతనం.. విజయ్ వెనుక అసలైన ‘చాణక్యుడు’ ఇతడే
-
Stock Market Crash: గల్ఫ్ ‘టెన్షన్’.. మార్కెట్ ‘డిప్రెషన్’.. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్.. 500 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్!
ట్రెండింగ్
-
3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!