Site icon NTV Telugu

Trump: ట్రంప్, మెలానియాకు అవమానం! సడన్‌గా ఆగిన యూఎన్ ఎస్కలేటర్ రైడ్‌.. వైట్‌హౌస్ సీరియస్

Trump1

Trump1

అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ప్రథమ మహిళ మెలానియాకు ఐక్యరాజ్యసమితిలో షాకింగ్ పరిణామం ఎదురైంది. యాదృచ్ఛికమో.. లేదంటే కావాలనే జరిగిందో తెలియదు గానీ.. యూఎన్ కార్యాలయంలో ట్రంప్, మెలానియా ఎస్కలేటర్ ఎక్కగానే హఠాత్తుగా ఆగిపోయింది. దీంతో ట్రంప్, మెలానియా ఇద్దరూ షాక్‌కు గురయ్యారు. ఏమైంది? అంటూ ట్రంప్ ప్రశ్నించారు. ఇంకా చేసేదేమీలేక మెలానియా నడుచుకుంటూనే పైకి వెళ్లిపోయారు. మెలానియా వెంట ట్రంప్‌ కూడా నడుచుకుంటూ పైకి వెళ్లిపోయారు. ఎస్కలేటర్ దిగగానే ట్రంప్ ఏమైందంటూ మరోసారి చేతి సైగలు చేశారు. అయితే ఈ పరిణామంపై వైట్‌హౌస్ సీరియస్ అయింది. ఉద్దేశపూర్వకంగా జరిగిందంటూ దర్యాప్తునకు ఆదేశించింది. ఇక ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

ఇది కూడా చదవండి: YS Jagan: నేడు వైఎస్‌ జగన్‌ కీలక సమావేశం..

సెప్టెంబర్ 23 (మంగళవారం) నుంచి ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు హాజరయ్యేందుకు మెలానియాతో కలిసి ట్రంప్ యూఎన్‌కు వచ్చారు. ఇద్దరూ కలిసి ఎస్కలేటర్ ఎక్కి పైకి వెళ్లబోతుండగా సడన్‌గా ఆగిపోయింది. దీంతో ఇద్దరూ షాక్‌కు గురయ్యారు. అయితే యూఎన్ సిబ్బంది ఉద్దేశపూర్వకంగానే ఇలా చేశారని అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ దర్యాప్తు చేయాలని ఆదేశించారు.

ఇది కూడా చదవండి: Crime News: సినిమా స్టోరీకి మించిన కథ.. దోపిడీ ముసుగులో భార్యను కిరాతకంగా చంపించిన భర్త!

అకస్మాత్తుగా ఎస్కలేటర్ ఎందుకు ఆగిపోయిందో తెలుసుకోవాలని కోరింది. ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ పేర్కొన్నారు. ఇది కచ్చితంగా ఏ మాత్రం లోపం కాదని.. ఉద్దేశపూర్వకంగానే ఇది జరిగిందని తెలిపారు. అదే గనుక జరిగితే వారిని వెంటనే తొలగించి దర్యాప్తు చేయాలని వైట్‌హౌస్ ఆదేశించింది.

ఇక ట్రంప్ ఐక్యరాజ్యసమితిలో తనదైన శైలిలో ప్రసంగించారు. ఐక్యరాజ్యసమితి నుంచి తనకు ఎదురైన పరిణామాలు.. ఒకటి చెడ్డ ఎస్కలేటర్, రెండోది చెడ్డ టెలిప్రాంప్టర్ అన్నారు. చాలా ధన్యవాదాలు అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇక ఏడు నెలల్లో ఏడు యుద్ధాలను ఆపానని.. కానీ ఐక్యరాజ్యసమితి నుంచి మాత్రం ఒక్క ఫోన్ కాల్ కూడా రాలేదని విమర్శించారు. ఐక్యరాజ్యసమితి నుంచి తనకు లభించినదంతా ఒక ఎస్కలేటర్ మాత్రమేనని.. పైకి వస్తుండగా ఆగిపోయిందని.. ప్రథమ మహిళ మంచి స్థితిలో లేకుంటే పడిపోయేదని.. కానీ ఆమె మంచి స్థితిలో ఉంది కాబట్టి.. మేమిద్దరం ఇప్పుడు మంచి స్థితిలో ఉన్నామని ట్రంప్ పేర్కొన్నారు.

Exit mobile version