NTV Telugu Site icon

Trump: పందెంలో ఓడిపోయిన వ్యక్తికే ట్రంప్ అందలం.. వీడియో వైరల్

Trumpvideo

Trumpvideo

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ త్వరలో బాధ్యతలు చేపట్టనున్నారు. జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయితే ఆయన ఇప్పటి నుంచే ప్రభుత్వ కూర్పు చేసుకుంటున్నారు. ఇప్పటికే ఆయా కీలక పోస్టుల్లో అనుభవజ్ఞులను నియమిస్తున్నారు. తాజాగా విద్యాశాఖ చీఫ్‌గా 76 ఏళ్ల లిండా మెక్‌మాన్‌ అనే మహిళను నియమించారు. ఈమె ట్రంప్‌నకు అత్యంత సన్నిహితురాలు. లిండా.. డబ్ల్యూడబ్ల్యూఈ మాజీ సీఈవో కూడా. మాజీ రెజ్లింగ్ ఎగ్జిక్యూటివ్ అయిన ఆమెకు కీలక బాధ్యతలు అప్పగించారు. లిండా మెక్‌మాన్‌తో పాటు ఆమె భర్త లిన్స్ మెక్‌మాన్‌తోనూ ట్రంప్‌నకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. లిన్స్ మెక్‌మాన్‌‌కు ట్రంప్ గుండు కొట్టించిన వీడియోను అమెరికన్లు గుర్తుచేసుకుంటున్నారు. ప్రస్తుతం ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

2007, జనవరిలో రా ఎపిసోడ్ జరిగింది. ప్రతి బిలియనీర్ ఒక ప్రొఫెషనల్ రెజ్లర్‌ను ఎంచుకున్నారు. డొనాల్డ్ ట్రంప్.. బాబీ లాష్లేని ఎంచుకోగా.. లిన్స్ మెక్‌మాన్.. ఉగామాను ఎంచుకున్నారు. అయితే ఓడిపోయిన వ్యక్తి రింగులో గుండు చేయించుకోవాలని పందెం వేసుకున్నారు. అయితే ఈ పందెంలో లిన్స్ మెక్‌మాన్ మద్దతు తెలిపిన ఉమాగా ఓడిపోయాడు.. ట్రంప్ మద్దతు పలికిన బాబీ లాష్లే విజయం సాధించాడు. దీంతో లిన్స్ ఓడిపోవడంతో ట్రంప్.. రింగులోకి ప్రవేశించి లిన్స్ మెక్‌మాన్ గుండు కొట్టారు. తల మీద క్రీమ్ రాసి మరీ గుండు కొట్టారు. తాజాగా లిండా మెక్‌మాన్‌ను విద్యాశాఖ చీఫ్‌గా నియమించడంతో 17 ఏళ్ల నాటి సంఘటనను అమెరికన్లు గుర్తుచేసుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను మీరు కూడా చూసేయండి.