Site icon NTV Telugu

Asim Munir: పాకిస్తాన్ ఏ లక్ష్యం కోసం ఏర్పడిందో, అది ఇప్పుడు నెరవేరుతోంది..

Asim Munir

Asim Munir

Asim Munir: ఇస్లాం పేరుపై ఏర్పడిన పాకిస్తాన్, ఏ లక్ష్యం కోసం ఏర్పడిందో, ఇప్పుడు అది సాధించే దిశగా ఉన్నామని పాకిస్తాన్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ అన్నారు. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ మనవడు జునైద్ సఫ్దర్ వలీమాకు హాజరైన bilwkh ఆయన పాక్ వార్తా పత్రిక ది న్యూస్ ఇంటర్నేషనల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ప్రధాని షెహబాజ్ షరీఫ్, పంజాబ్ సీఎం మరియం నవాజ్, సీనియర్ సైనిక అధికారులు, క్యాబినెట్ మంత్రులు హాజరయ్యారు.

పాకిస్తాన్ ఏ గొప్ప ఉద్దేశ్యాన్ని సాధించడానికి ఏర్పడిందో, అల్లా దయ చేత ఇప్పుడు ఆ అవకాశం వచ్చిందని అన్నారు. పాక్ తన గమ్యం వైపు వెళ్తోందని మునీర్ వ్యాఖ్యానించారు. ‘‘పాకిస్తాన్ ఇస్లాం పేరుతో ఏర్పడింది. నేడు ఇస్లామిక్ దేశాల్లో ప్రత్యేక హోదా, ప్రాముఖ్యత సాధించింది’’ అని ఆయన చెప్పారు. అల్లా ఆశీర్వాదాల వల్లే ఇదంతా సాధ్యమైందని అన్నారు. ప్రపంచ వేదిపై పాకిస్తాన్ స్థానం, ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగైందని ఆయన అన్నారు. తనకు వ్యక్తిగతంగా వచ్చిన ఏ ప్రశంస అయినా అల్లా దయ వల్లే వచ్చిందని, ఒక వ్యక్తి పాకిస్తాన్ ఎప్పటికీ అధికమే అని చెప్పారు.

Read Also: Virat Kohli Mystery Drink: ఇండోర్ వన్డే మ్యాచ్‌.. విరాట్ కోహ్లీ తాగిన ఆ మిస్టరీ డ్రింక్ ఏంటి?

ఇటీవల, యూఎస్‌తో పాకిస్తాన్ ‘‘రేర్ ఎర్త్ ఖనిజాల’’డీల్ కుదుర్చుకుంది. సౌదీ అరేబియా-పాకిస్తాన్ మధ్య రక్షణ ఒప్పందం కుదిరింది. దీంతో పాటు సౌదీ-పాక్-టర్కీలు కలిసి ఇస్లామిక్ నాటోకు ప్లాన్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇస్లామిక్ దేశాలపై తమ ఆధిపత్యం పెరిగిందని పాకిస్తాన్ భావిస్తోంది. ఇక గతేడాది భారత్‌తో జరిగిన ‘‘ఆపరేషన్ సిందూర్’’లో తామే గెలిచామని పాకిస్తాన్ చెప్పుకుంటోంది. ఎయిర్ బేస్‌లు కోల్పోయిన తర్వాత కూడా పాకిస్తాన్ ఈ వాదన చేస్తోంది. ఇక ఈ ఘర్షణ తర్వాతే, ఆసిమ్ మునీర్‌కు పాక్ ప్రభుత్వం ‘‘ఫీల్డ్ మార్షల్’’ పదోన్నతిని ప్రకటించింది.

అసిమ్ మునీర్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్‌లో అత్యధిక మతోన్మాద భావాలను కలిగిన వ్యక్తి. తరుచుగా సైన్యాన్ని, పాకిస్తాన్‌ను మతంతో ముడి పెడుతున్నాడు. ఏప్రిల్ ఏప్రిల్ 2025లో ఇస్లామాబాద్‌లో జరిగిన ఓవర్సీస్ పాకిస్తానీ కన్వెన్షన్‌లో ప్రసంగిస్తూ, ముస్లింలు మరియు హిందువుల మధ్య సరిదిద్దలేని తేడాలు ఉన్నాయంటూ వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ ఏర్పాటుకు ఇదే కారణమని, కల్మాపై ఆధారపడి ఉందని అన్నారు. ఈ మొత్తం పరిణామాలు చూస్తే పాకిస్తాన్ ప్రపంచంలో ఇస్లామిక్ ప్రపంచానికి పెద్దన్న కావాలని ఆశ పడుతోందనేది సుస్పష్టం. ఇస్లామిక్ దేశాల్లో ప్రస్తుతం పాక్ వద్ద మాత్రమే అణ్వాయుధాలు ఉన్నాయి. దీని ద్వారా ఇస్లామిక్ నాటోను ఏర్పాటు చేయాలని ఉవ్విళ్లూరుతోంది.

Exit mobile version