Titan: అట్లాంటిక్ మహా సముద్రంలో టైటానిక్ శిథిలాలు చూసేందుకు టూరిస్టులను తీసుకెళ్లిన ‘టైటాన్’ సబ్‌మెర్సిబుల్ ఆచూకీ లభించింది. టైటానికి సమీపంలోనే దీని శిథిలాలను కనుగొన్నారు. అయితే టైటాన్ మిస్సైన కొద్ది సేపటికే అది పేలిపోయినట్లు యూఎస్ నేవీ గుర్తించింది. అండర్వాటర్ సౌండ్ మానిటరింగ్ పరికరాల ద్వారా టైటాన్ సబ్‌మెర్సిబుల్ పేలినట్లు యుఎస్ నేవీ గుర్తించినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ గురువారం నివేదించింది. మ్యూనికేషన్‌లు కోల్పోయినప్పుడు టైటాన్ సబ్‌మెర్సిబుల్ పనిచేస్తున్న సాధారణ పరిసరాల్లో పేలుడు లేదా పేలుడుకు అనుగుణంగా ఉండే అసాధారణతను గుర్తించింది అని అధికారి జర్నల్‌తో చెప్పారు. దాదాపుగా నాలుగు రోజుల వెతుకులాట తర్వాత సముద్రగర్భంలో 3800 మీటర్లు లోతులో టైటాన్ అవశేషాలను యూఎస్ కోస్ట్ గార్డ్ కనుగొంది. టైటాన్ లో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రయాణికులు మరణించినట్లు తెలుస్తోంది.
Read Also: PM Modi: ఇండియా త్వరలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుంది..
టైటానిక్ శిథిలాలు దాదాపుగా సముద్ర ఉపరితలం నుంచి 4 కిలోమీటర్ల లోతులో ఉన్నాయి. వీటిని చూపించేందుకు అమెరికాకు చెందిన ఓషన్ గేట్ ఇంక్ అనే కంపెనీ టైటాన్ అనే ఒక సబ్ మెర్సిబుల్ సహాయంతో ఇంతకుముందు అనేక సార్లు సముద్రంలోకి వెళ్లి టైటానిక్ శిథిలాలను చూపించింది. ఈ సారి మాత్రం ‘కాటస్ట్రిఫిక్ ఇంప్లోజన్’ కారణంగా టైటాన్ పేలిపోయింది. సముద్ర అడుగు భాగంలో విపరీతమైన పీడనాన్ని తట్టుకునే విధంగా టైటాన్ రూపొందించబడింది. అయితే ఈ సారి మాత్రం ఆ వ్యవస్థ పనిచేయకపోవడంతో ఒక్కసారిగా పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. టైటాన్ ఉన్న ప్రాంతంలో సాధారణ వాతావరణ పీడనంలో పోలిస్తే 400 రెట్లు పీడనం ఉంటుంది. సముద్రం మట్టం వద్ద వాతావరణ పీడనం చదరపు అంగుళానికి 14.7 పౌండ్లు (psi) ఉంటుంది. నీటిలో లోపట 6000 psi ఉంటుంది.
అంతటి శక్తిని టైటాన్ తట్టుకోలేక పేలిపోయినట్లు తెలుస్తోంది. అపారమైన నీటి పీడనం వల్ల సబ్ మెరైన్ మల్లి సెకన్లలో కుప్పకూలింది. నిజానికి టైటాన్ అంతటి పీడనాన్ని తట్టుకునేలా తయారు చేయబడింది. అయితే అందులో భద్రతాపరమైన సమస్యలు తలెత్తి ఉంటాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ‘ప్రెషర్ హాల్ వైఫల్యం’ వల్ల పేలుడు సంభవించి ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
