NTV Telugu Site icon

Benjamin Netanyahu: “ఎవరు మాకు హాని చేయాలని చూశారో.. వారికి మేం హాని చేస్తాం”.. ఇరాన్‌కి హెచ్చరిక..

Israel Pm Netanyahu

Israel Pm Netanyahu

Benjamin Netanyahu: సిరియాలో ఇరాన్ ఎంబసీపై ఇజ్రాయిల్ వైమానిక దాడికి ప్రతీకారంగా ఈ రోజు ఇరాన్, ఇజ్రాయిల్‌పై విరుచుకుపడింది. డ్రోన్లు, మిస్సైళ్లతో దాడి చేసింది. అయితే, ఇజ్రాయిల్ రక్షణ వ్యవస్థ వీటిని అడ్డుకుని నాశనం చేసింది. ఇదిలా ఉంటే ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలపై ప్రపంచం ఆందోళన చెందుతోంది. ఇరు దేశాలు సంయమనం పాటించాలని కోరుతున్నాయి. ఇదిలా ఉంటే ఇరాన్ ప్రత్యక్ష దాడికి తమ దేశం చాలా ఏళ్లుగా సిద్ధమవుతోందని, ‘‘తమకు హాని కలిగించే ఎవరికైనా తాము హాని కలిగిస్తాం’’ ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఇరాన్‌కి వార్నింగ్ ఇచ్చారు.

Read Also: Live-in Relation: లివ్ ఇన్ రిలేషన్‌లో ఉన్న మహిళ దారుణహత్య.. బిడ్డను కూడా వదల్లేదు..

‘‘ఇటీవల సంవత్సరాల్లో, ముఖ్యంగా ఇటీవల వారాల్లో ఇరాన్ ప్రత్యక్ష దాడికి ఇజ్రాయిల్ సిద్ధమవుతోంది. మా రక్షణ వ్యవస్థలు మోహరించబడ్డాయి. మేము రక్షణాత్మకంగా అంతా సిద్ధంగా ఉన్నాము. ఇజ్రాయిల్ బలంగా ఉంది. ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) బలంగా ఉంది. ఇజ్రాయిల్ ప్రజలు ధైర్యంగా ఉన్నారు’’ అని నెతన్యాహూ అన్నారు. ఇరాన్ దాడిని అమెరికా తీవ్రంగా ఖండించింది. ఇజ్రాయిల్‌కి అండగా నిలుస్తామని చెప్పింది. ఇరాన్‌తో పాటు దాని మిత్రదేశాల నుంచి ప్రాక్సీలు(హిజ్బుల్లా, హమాస్) వంటివి కూడా దాడికి పాల్పడ్డాయి.

‘‘ఇజ్రాయిల్‌కి అండగా నిలిచిన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇతర దేశాలను మేము అభినందిస్తున్నాము. మాకు ఎవరూ హాని కలిగించానా, వారికి మేము హాని చేస్తాము. ఇదే మా సూత్రం. ఏదైనా ముప్పు నుంచి మనల్ని మనం రక్షించుకుంటాము. దీంట్లో ఇజ్రాయిల్ దృఢ నిశ్చయంతో ఉంది’’అని నెతన్యాహూ చెప్పారు. ఏప్రిల్ 1న సిరియా రాజధాని డమాస్కస్‌లోని ఇరాన్ ఎంబసీపై ఇజ్రాయిల్ వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో ఇద్దరు జనరల్స్‌తో సహా ఏడుగురు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్(ఐఆర్జీసీ) సిబ్బంది మరణించారు. అప్పటి నుంచి ఇరాన్ ఇజ్రాయిల్‌పై ప్రతీకారేచ్ఛతో రగిలిపోతోంది.

Show comments