NTV Telugu Site icon

Joe Biden: జో బైడెన్ కీలక నిర్ణయం.. ఉక్రెయిన్‌కు మరిన్ని ఆయుధాలు అందిస్తామని వెల్లడి..

Biden

Biden

Joe Biden: క్రిస్మస్ పండగ వేళ ఉక్రెయిన్‌లోని పలు విద్యుత్‌ కేంద్రాలే లక్ష్యంగా రష్యా దాడులు చేసింది. ఈ క్రమంలోనే మాస్కో దాడుల నుంచి కీవ్‌ను రక్షించేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్‌కు మరిన్ని ఆయుధాలు అందించడానికి రెడీ అయ్యాడు. దీనిపై ఇప్పటికే రక్షణ మంత్రిత్వశాఖకు ఆదేశాలు పంపినట్లు ఆయన చెప్పారు. ఉక్రెయిన్ గ్రిడ్ వ్యవస్థను నాశనం చేసి అక్కడి ప్రజలకు విద్యుత్ సరఫరా అందకుండా రష్యా కుట్ర చేస్తుందన్నాడు. మరికొన్ని రోజుల్లో బైడెన్‌ అధ్యక్ష పీఠం నుంచి తప్పుకోనున్నాడు.. ఈ క్రమంలోనే డొనాల్డ్ ట్రంప్‌ అధికారంలోకి వచ్చే నాటికి ఉక్రెయిన్ కి మరింత ఎక్కువ సాయం చేయాలనే ఉద్దేశంతో బైడెన్‌ ప్రభుత్వం వరుస నిర్ణయాలను తీసుకుంటుంది.

Read Also: Khalistani Terrorist: ప్రయాగ్‌రాజ్‌లో జరగబోయే కుంభమేళాలో మోడీ, యోగినే మా టార్గెట్..

కాగా, ఇప్పటికే 725 మిలియన్‌ డాలర్ల ప్యాకేజీని జో బైడెన్ ప్రభుత్వం ప్రకటించగా.. దానికి అదనంగా మరో 988 మిలియన్‌ డాలర్ల ఆయుధ సామగ్రిని అందజేస్తామని మాట ఇచ్చింది. అమెరికా నుంచి కీవ్‌కు 2022 నుంచి ఇప్పటి వరకు 62 బిలియన్‌ డాలర్లకు పైగా విలువైన ఆయుధాలు, ఇతర సహాయం అందిజేశారు. అయితే, గత కొన్ని రోజులుగా ఉక్రెయిన్‌పై రష్యా దాడులను మరింత తీవ్రతరం చేసింది. దీనికి తోడు నార్త్ కొరియా దళాలు మాస్కోకు తోడుగా ఉంటున్నాయి. ఇక, కీవ్‌ తనను రక్షించుకునేందుకు జో బైడెన్‌ కార్యవర్గం పెద్ద మొత్తంలో ఆయుధాలను సరఫరా చేస్తోంది. కాగా, క్రిస్మస్ పండగ రోజున ఉక్రెయిన్‌లోని పలు విద్యుత్ కేంద్రాలపై రష్యా దాడులు చేశాయి. 70కి పైగా క్షిపణులు, 100కు పైగా డ్రోన్లను ప్రయోగించినట్లు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వెల్లడించారు. అందులో 50 క్షిపణులను, పలు డ్రోన్లను తమ సేనలు పడగొట్టినట్లు చెప్పుకొచ్చాడు.

Show comments