Kamala Harris: అమెరిక అధ్యక్ష ఎన్నికలు జోరందుకున్నాయి. కాల్పుల ఘటన తర్వాత డొనాల్డ్ ట్రంప్ కు యూఎస్ ప్రెసిడెంట్ గా విజయం సాధించేందుకు అవకాశాలు మెరుగుపర్చుకోవడంతో.. జో బైడెన్ విచిత్ర ప్రవర్తనతో సొంత పార్టీ నేతలకే తలనొప్పిగా మారిపోయాడు. ఈ నేపథ్యంలో డెమొక్రాటిక్ పార్టీ దాతలకు అధ్యక్ష ఎన్నికలలో పార్టీ గెలుస్తుందని అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ భరోసా ఇచ్చారు. ఎక్కువ మంది చట్టసభ సభ్యులు మరోసారి అధ్యక్షుడిగా జో బైడెన్‌ను నిలబెట్టాలని పిలుపునిచ్చారని చెప్పుకొచ్చింది. పార్టీకి చెందిన దాతలను శాంతింపజేయడానికి షార్ట్ నోటీసుపై ఏర్పాటు చేసిన కాల్‌లో.. మేము ఈ ఎన్నికల్లో గెలవబోతున్నామని అన్నారు. ఈ ఎన్నికల్లో ఏ అభ్యర్థి అమెరికన్ ప్రజలకు మొదటి స్థానం ఇస్తారో మాకు తెలుసు.. మా అధ్యక్షుడు జో బైడెన్.. 2024 అధ్యక్ష రేసులో కొనసాగుతానని ప్రమాణం చేశారని కమలా హారిస్ గుర్తు చేశారు.
Read Also: Snakes In Home: దేవుడా.. అది ఇళ్ల లేక పాముల పుట్ట.. 16 పాములు, 32 గుడ్లు..
ఇక, డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్షుడు జో బైడెన్ నామినేషన్‌ను వేగవంతం చేయాలని యోచిస్తుందని కమలా హారిస్ పేర్కొనింది. మరోవైపు, తొమ్మిది మంది డెమొక్రాటిక్ చట్టసభ సభ్యులు బైడెన్‌ను ప్రెసిడెంట్ రేసు నుంచి తప్పుకోవాలని పిలుపునిచ్చారు. డెమొక్రాటిక్ పార్టీకి చెందిన దాతలు ఎన్నికల ప్రచారానికి నిధులను నిలిపివేస్తామని బెదిరించడంతో.. ఈవెంట్‌లలో పాల్గొన్న వైఎస్ ప్రెసిడెంట్ కమలా హరిస్.. ఈ ఎన్నికల్లో తప్పకుండా తాము విజయం సాధించబోతున్నామని వారికి భరోసా కల్పించింది.