NTV Telugu Site icon

Joe Biden: మరోసారి “తప్పు”లో కాలేసిన జో బైడెన్.. జెలెన్ స్కీని పుతిన్‌గా సంబోధన..

Biden

Biden

Joe Biden: ఇటీవల అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ వరస వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. పలు సమావేశాల్లో అసలు ఏం చేస్తున్నాడో కూడా అర్థం అవ్వడం లేదు. ఇటీవల ఇటలీ వేదికగా జరిగిన జీ-7 సమావేశాల్లో దేశాధినేతలంతా ఫోటోలకు ఫోజ్ ఇస్తుంటే, బైడెన్ మాత్రం వేరే వైపు వెళ్లడం, అక్కడ ఎవరూ లేకున్నా చేతులతో అభివాదం చేయడం వైరల్‌గా మారింది. అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇటీవల జరిగిన డిబేట్లలో పలువురిని తప్పుగా సంబోధించడం చేశారు. కొన్నిసార్లు అలాగే కదలకుండా నిలబడి ఉంటున్న బైడెన్ తీరుపై అమెరికన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read Also: India’s Population: 2100 నాటికి తగ్గనున్న ఇండియా జనాభా.. అప్పటికీ చైనా కన్నా 2.5 రెట్లు ఎక్కువే..

ఇదిలా ఉంటే, తాజాగా నాటో సమావేశంలో మరోసారి బైడెన్ తప్పులో కాలేశాడు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలడిమిర్ జెలెన్ స్కీని, పుతిన్‌గా పిలవడం చర్చనీయాంశంగా మారింది. ఉక్రెయిన్-రష్యా యుద్ధ నేపథ్యంలో బైడెన్ జెలెన్ స్కీని ఇలా పిలవడంపై ఆయన ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ సమయంలో జెలెన్ స్కీ ఏం చేయాలో తెలియక, నవ్వుతూ కనిపించాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.

చివరకు బైడెన్ తనను తాను సరిదిద్దుకుంటూ, ‘‘ప్రెసెడెంట్ జెలెన్ స్కీ మీరు పుతిన్‌ని ఓడించబోతున్నారు. నేను పుతిన్‌ని ఓడించడంపై దృష్టి పెట్టాను’’ అని అన్నారు. అప్పటి వరకు షాక్‌లో ఉన్న జెలెన్ స్కీ కోలుకుని ‘‘నేను పుతిన్ కంటే మంచివాడిని’’ అని ప్రతిస్పందించారు. అంతకుముందు కూడా పలుమార్లు బైడెన్ ఇలాగే చేశారు. వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌ని వైస్ ప్రెసిడెంట్ ట్రంప్ అంటూ మాట్లాడారు. డెమెక్రాట్ల పక్షాన అధ్యక్ష బరిలో ఉన్న బైడెన్‌పై అమెరికన్లు పెదవి విరుస్తున్నారు. అతడిని అధ్యక్ష రేసు నుంచి పక్కన పెట్టేయాలని సొంత పార్టీ నుంచి కోరుతున్నారు.